మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “బాల రక్షక్” వాహనాన్నిప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన.     తేది:9.12.2021, వనపర్తి.

ప్రభుత్వం మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “బాల రక్షక్” వాహనాన్ని 18 సంవత్సరాల లోపు పిల్లలకు రక్షణ, సంరక్షణ కొరకు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా “బాల్య రాక్షక్” వాహనాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 సంవత్సరాలలోపు పిల్లలకు, వారి సంరక్షణ కొరకు వినియోగించాలని ఆయన తెలిపారు. అంగన్వాడీ టీచర్లకి మొబైల్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది. దీని ద్వారా చిన్నపిల్లల పెరుగుదల, పోషణ తదితర వివరాలను ఫోన్ ద్వారా నమోదు చేయాలని ఆయన సూచించారు.
కరోనా వల్ల మృతి చెందిన కుటుంబాలకు కేర్ ఇండియా ఆధ్వర్యంలో మంత్రి నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. అంగన్వాడి టీచర్లకు చీరలను పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, డి డబ్ల్యూ ఓ పుష్పలత, సి.డబ్ల్యు.సి. చైర్ పర్సన్ అలివేలమ్మ, చిన్నంబావి జడ్పిటిసి వెంకట రమణమ్మ, డి సి పి ఓ రాములు, కేర్ ఇండియా, ఈదన్న,  డి.సి.పి.యు. సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్ లు,  టీచర్లు హజీరా బేగం, జ్యోతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post