మాజీ ప్రధాని పివి ఇంటి ఎదరుగా వున్న ప్రత్యేక గద్దెపై వంగర గ్రామంలో ఈ నెల 29నుండి ప్రారంభమైన బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రావిణ్య

 

వంగర
భీమదేవరపల్లి..
వంగర గ్రామంలో ఈ నెల 29నుండి ప్రారంభమైన బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమాలు భూదేవి,బొడ్రాయి శ్రీలక్ష్మి,విగ్రహాలను మాజీ ప్రధాని పివి ఇంటి ఎదరుగా వున్న ప్రత్యేక గద్దెపై వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రయాణించారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ ప్రవీణ్ శర్మ నేత్రుత్వంలోని పన్నెండు మంది అర్చకుల బ్రుందం ఉదయం 6.48 నిమిషాలకు మిధున లగ్నంలో యంత్ర ప్రతిష్ఠ, భూలక్ష్మి,మహాలక్ష్మీ, నాభి శిల.బొడ్రాయి విగ్రహ స్థిర ప్రతిష్ట జయాది హోమాలు,బలిహరణ,కార్యక్రమాలు కన్నులు పండువగా నిర్వహించారు.అనంతరం గత మూడు రోజులుగా జర్గుతున్న హోమ కార్యక్రమాలు పూర్ణహుతితో పరిసమాప్తి చేశారు.దేవతల ప్రతిష్ఠ కార్యక్రమంలొ గ్రామ మహిళలు మంగళ హారతులతో పెద్ద ఎత్తున ఉదయం నుండే పాల్గొన్నారు.ఈ రోజు జరిగిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రవణ్ కుమారు ఆయన మాత్రుమూర్తి శారద దేవి,హుస్నాబద్ శాసన సభ్యులు సతీష్ బాబు,జడ్పీ చేర్మన్ సుధీర్ కుమార్ వరంగల్,హనుమకొండ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య,సిక్తా పట్నాయక్,వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్,పి.వి.కుమారడు ప్రభాకర్ రావు,పి.వి.మనవడు రాఘవేంద్ర కాశ్యప్, పివి సోదరుడు పి.వి.మనోహర్ రావు, కుటుంబ సభ్యులు సీతారామ రావు,శరత్,మదన్ మోహన్,రాజ్ మోహన్,సర్పంచ్ రజిత ఉపసర్పంచ్ రాజు,యంపిటిసి కౌసల్య, కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, బిజెపి నాయకులు సురేందర్ రెడ్డి,వార్డు సభ్యలు కుమార్ ,కండె రమేశ్,సుధాకర్,చక్రపాణి,తిరుపతి రెడ్డి, సతీష్,మొండయ్య,క్రిష్ఞం రాజు,కస్తూరి కొంరయ్య,
రమేశ్,వెంకట రెడ్డి,ఒల్లాల రమేశ్ మారం సతీష్ కుల సంఘాల నాయకులు కాల్వ అయిలయ్య,తిరుపతి,గంగం వెంకటరెడ్డి,వీరస్వామి,సంజీవ్,బొల్లి రాజయ్య ,గజ్జెల సంజీవ్,పెరుమాళ్ రవి,శ్రీరామోజు సీను,ఎనుక కిరణ్,మంచాల చంధ్రమౌళి పాల్గొన్నారు.
ప్రతిష్టా పూర్ణాహుతి కార్యక్రమంలో పి.వి.సోదరడు మనోహర్ రావు భాగస్వామ్యం అయ్యారు.
పి.వి.కుటుంబ సభ్యలతో గడిపిన హనుకొండ,వరంగల్ జిల్లా కలెక్టర్లు సిపి .
హైకోర్టు న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ వంగర పర్యటన సందర్భంగా ఆయనను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చిన కలెక్టర్లు సిక్తా పట్నాయక్,ప్రావీణ్య,సిపి రంగనాథ్ బొడ్రాయి సందర్భంగా వంగరకు వచ్చిన పివి బంధువులను పి.వి.నివాంలో కలిసి వారి బాల్య జ్ఞాపకాలను అడిగి తెల్సుకున్నారు.అనంతరం పి.వి.మ్యూజియం సందర్శించారు నాటి పివి పోటోలు వాడిన కంప్యూటర్లు తదితర వస్తువులను ఆసక్తిగా తిలకించారు.
అనంతర బొడ్రాయి విగ్రహలకు పూజలు నిర్వహించారు.
నాకు ఆనందంగా ఉంది జస్టిస్ నచ్చరాజు వెంకట శ్రవణ్ కుమార్.
తన తల్లిగారి ఊరైన వంగర గ్రామాన్ని బొడ్రాయి సందర్భంగా సందర్శించడం ఆనందంగా వుంది తమ తాతగారైన పి.వి.అమ్మమ్మ సత్యమ్మతో పాటు అమ్మగారితో వంగరకు చాలాసార్లు రావడం జరిగింది ఆయనతో ఎక్కువ సమయం గడపడం వల్ల వారి ప్రభావం మాపై పడింది.అదే కష్డించి ఎదుగాలనే తత్వం.ఈత వంగలోనే సైకిల్ తొక్కడం వంగరలో నేర్చుకున్నా!వేసవి సెలవులకు మా అన్నలు సుబాష్,కిరణ్ లతో వంగరకు వచ్చి తాతలు మాధవ రావు మనోహర్ రావు కుటుంబ సభ్యులతో గడిపే వాళ్లం.
వంగరతలో పాటు స్వంత గ్రామము గగ్గిళ్ల పి.వి.హయాంలో ఎంతో అభివృద్ధిని సాధించాయి.
న్యాయమూర్తిగా అత్యుత్తమ సేవలను అందించేందుకు క్రుషి చేస్తా అన్నారు.

 

Share This Post