మాజీ ప్రధాని స్వర్గీయ పివి నర్సింహా రావు దేశానికి ఎనలేని సేవలు అందించారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

గురువారం పివి 17 వ వర్ధంతి సందర్భంగా పివి మార్గ్ లోని పివి జ్ఞాన భూమి లో గల పివి ఘాట్ పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్నారు. దేశం గర్వించే విధంగా సమర్ధవంతమైన పాలనతో ప్రజాధారణ పొందారని చెప్పారు. తాను తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి పథంలో వెళుతుందని గుర్తు చేశారు.  పివి సేవలకు గుర్తింపు గా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కె సి ఆర్ ఆధ్వర్యంలో పివి శతజయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించి గౌరవించుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పివి సేవలను గుర్తించక పోవడం బాధాకరం అన్నారు.

          ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎం ఎల్ సి  సురభి వాణిదేవి, ప్రభుత్వ సలహాదారు రమణా చారి, ముషీరాబాద్ ఎం ఎల్ ఏ ముఠా గోపాల్, బి సి కమిషన్ చైర్మన్  వకుళాభరణం కృష్ణ మోహన్,  మాజీ ఎం ఎల్ సి  శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

????????????????????????????????????

Share This Post