మాజీ మంత్రి ఫరిదొద్ధిన్ పార్థివదేహానికి నివాళులర్పించిన మున్సిపల్, పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు

మాజీ మంత్రి ఫరిదొద్ధిన్ పార్థివదేహానికి నివాళులర్పించిన మున్సిపల్, పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు

గౌ.ఫరిదొద్ధిన్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది

ఫరిదొద్ధిన్ మహా నాయకుడు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారు

మహా నాయకుడిని కోల్పోయాం
రాష్ట్రానికి ఎనలేని సేవలందించారు
…… మంత్రి తారక రామారావు

అకాల మరణానికి గురైన మాజీ మంత్రి ఫరిదొద్ధిన్ పార్థివదేహానికి రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం జహీరాబాద్ పట్టణం లోని బాగారెడ్డి స్టేడియంలో ఘనంగా నివాళులర్పించారు.

మాజీ మంత్రి ఫరిదొద్ధిన్ పార్థివదేహానికి రాష్ట్ర హోం శాఖ మాత్యులు మహమూద్ అలీ, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి,శాసన మండలి ప్రోటైం చైర్మన్ వి .భూపాల్ రెడ్డి ,శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ హోదాలలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి తారక రామారావు మాట్లాడుతూ ఫరిదొద్ధిన్ అందరికీ సుపరిచితులు, ఆప్తుడు, అజాతశత్రువు ,సౌమ్యుడని అన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రేమగా పలకరించి దగ్గరికి తీసుకునే మంచి వ్యక్తి అని కొనియాడారు. ఫరిదొద్ధిన్ గారి అకాల మరణం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి,కలతకు గురి చేసిందన్నారు.గౌరవ ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు.

మహా నాయకుడు ,మంచి వ్యక్తిత్వం గల ఫరిదొద్ధిన్ గారు లేకపోవడం టిఆర్ఎస్ పార్టీకి,వారి కుటుంబానికే కాకుండా పూర్వ మెదక్ జిల్లా మొత్తానికి తీరనిలోటన్నారు.

వివిధ హోదాలలో పని చేసిన ఆయన రాష్ట్రానికి ఎనలేని సేవలందించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పూర్తి అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆ మేరకు ఫరిదొద్ధిన్ స్వగ్రామం హోతీ ‘ బి ‘ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను చేస్తున్నట్లు తెలిపారు.

పార్టీ తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ఫరిదొద్ధిన్ గారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. అదేవిధంగా ఫరిదొద్ధిన్ గారి ఆత్మకు శాంతి కలగాలని మంత్రి కోరారు.

అనంతరం హోతి బి గ్రామం లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను చేశారు.
ప్రభుత్వం తరఫున మంత్రితో పాటు రాష్ట్ర హోం శాఖ మాత్యులు ఎంపీలు జడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యేలు శాసనమండలి సభ్యులు టిఆర్ఎస్ పార్టీ వివిధ హోదాల ప్రతినిధులు, ప్రజలు అంత్యక్రియలలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Share This Post