మాతా, శిశు ఆరోగ్య కేంద్రం, నవజాత శిశువు సంరక్షణ కేంద్రం, సిసి రోడ్ల, టి డయాగ్నొస్టిక్ సెంటర్ పనులకు ప్రారంభోత్సవాలు. శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర వైద్యాఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:25.01.2022, వనపర్తి.

తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధి పథంలో నడిచేందుకు కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్యాఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు తెలిపారు.
మంగళవారం వనపర్తి పట్టణంలో రూ.17 కోట్లతో ఏర్పాటు చేసిన 100 పడకల మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం సిసి రోడ్ల శంకుస్థాపన, టి డయాగ్నొస్టిక్ సెంటర్ పనులకు మంత్రి శంకుస్థాపన నిర్వహించారు.
అనంతరం మీడియా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ళ దామోదర్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 23 మాతా, శిశు ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. వనపర్తి జిల్లా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చొరవతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆరు రోడ్లను ఫోర్ లైన్ రోడ్స్ గా మంత్రి కృషి చాలా గొప్పదని ఆయన కొనియాడారు. వనపర్తిలో మారో రూ.100 కోట్లతో అభివృద్ధి పనుల కోసం అనుమతులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
గత కొంత కాలంగా రాష్ట్రంలో 30 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు ప్రస్తుతం యాభై శాతానికి పెరిగిందని, ఎక్కడైనా డాక్టర్ పోస్టు ఖాళీగా వుంటే జిల్లా కలెక్టరు నుండే నియామకం చేసుకునే వీలు కల్పించినట్లు ఆయన సూచించారు. గతంలో సగటున  ఒక లక్షకు 25 శిశు మరణాలు నమోదు కాగా, ప్రస్తుతం 16గా నమోదు అవుతున్నట్లు, మరణాల రేటు చాలా తగ్గిందని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేని దుస్తితి, ప్రస్తుతం రూ.15 వందల కోట్ల రూపాయలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. విద్య, వైద్యం, సాగునీటి రంగాలలో పాలమూరు జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో ఉమ్మడి జిల్లాలో రేడియాలజీ లాబ్స్ అందుబాటులోకి తెస్తున్న ట్లు ఆయన సూచించారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం దేశంలో వైద్య సేవలలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నట్లు, రాబోయే రోజుల్లో మొదటి స్థానంలో నిలిచేందుకు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.2 లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచినట్లు ఆయన వివరించారు. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని, రెండు డోసులు, బూస్టర్ డోసు పూర్తిచేయాలని ఆయన సూచించారు. జిల్లాలో 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య గల యువత వ్యాక్సినేషన్ లో 90 శాతం పూర్తి చేసి, రాష్ట్రంలో  వనపర్తి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ ను ఆయన అభినందించారు. జ్వరం సర్వేలో భాగంగా రాష్ట్రంలో 1 లక్షా 90 వేల 6 వందల కొవిడ్ కిట్లను, టెస్ట్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్ లు అందుబాటులో ఉంచినట్లు,ఆయన వివరించారు.
ఐసీఎంఅర్ నివేదిక ప్రకారం వాక్సిన్ వేసుకుని వారికే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నదని, ప్రజా ప్రతినిదులు వాక్సిన్ వేయించే పనిలో చొరవ తీసుకుని 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని మంత్రి కోరారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కోవిడ్ కిట్ లు చాలా బాగా పనిచేస్తున్నాయని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లవలసిన అవసరం లేదని ప్రజలకు ఆయన సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మందులు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా పరిధి లోనే అత్యాధునిక వసతులతో కూడిన వైద్యం అందుతుందని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓకే సంవత్సరంలో ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం చరిత్రాత్మకం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం నూతనంగా నిర్మిస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం సముదాయం పనులను మంత్రి పరిశీలించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించి, 20 పడకల నవజాత శిశువు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.  రూ.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను, రూ.500 కోట్లతో నిర్మించే మెడికల్ కళాశాల స్థలాన్ని మంత్రి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, మెడికల్ అసోసియేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి ,గువ్వల బాల్రాజ్, ఎమ్మెల్సీ కూతుళ్ల దామోదర్ రెడ్డి, డి ఎమ్ హెచ్ ఓ చందు నాయక్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డి. ఎం. ఈ. రమేష్ రెడ్డి, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.వి. సునందిని, వైస్ ప్రిన్సిపల్ డా. దేవదాస్, వాకాటి కరుణ, జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post