మాతా, శిశు కేంద్రం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో (ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేపట్టిన మాతా, శిశు కేంద్రం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఆనుపత్రి పర్యవేక్షకులు డా॥ అరవింద్‌, ఈ.ఈ. కుమార్‌ లతో కలిసి మాతా, శిశు కేంద్రాన్ని ఆకన్మిక తనిఖీ చేశారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మాతా, శిశు కేంద్రాల ఏర్పాటులో భాగంగా జిల్లాకు కేటాయించిన కేంద్రాన్ని త్వరగా పూర్తి చేని వినియోగంలోకి తీనుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా నంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. పనుల నిర్వహణలో అలనత్వం వహిస్తే నంబంధిత శాఖ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీనుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంబంధిత శాఖల అధికారులు, గుత్తేదారు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post