మాతా శిశు కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం…2
మాతా శిశు కేంద్రం పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి,జూలై 31:- జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.సంగీత సత్యనారాయణ అన్నారు. శనివారం రోజున జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న మాతా శిశు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు కేంద్రం సెప్టెంబర్ వరకు పూర్తి చేయాలని,మతా శిశు ఆసుపత్రి ఎదురుగా ఉన్న మార్చురీని తరలించి, కొత్త మార్చురీకి ప్రతిపాదనలు తయారు చేయాలని,మాతా శిశు కేంద్రం లో 3 లిఫ్ట్ లు ఉండేలా చూడాలని మరియు మూడు లిఫ్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని,ఆసుపత్రిలో ఆక్సిజన్ పాయింట్ పైప్ లైన్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, జిల్లా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ పైన అదనపు ఫ్లోర్ నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

    *DCHS &  జిల్లా ఆసుపత్రి సూపరెండేంట్ డాక్టర్  మందల వాసుదేవ రెడ్డి,SE(TSMSIDC)దేవేందర్ కుమార్, DE వెంకట రమణ,ఏ.ఈ.,కాంట్రాక్టర్,తదితరులు పాల్గొన్నారు*

జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి గారిచే జరిచేయనైనది.

మాతా శిశు కేంద్రం నిర్మాణ పనులను పరిశిలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

Share This Post