మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు ప్రోత్సహించాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్దం-1
జనగామ, డిసెంబర్, 13:
మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టర్ చంపక్ హిల్స్ లోని మాతా శిశు సంరక్షణ అరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ప్రోత్సహించి అత్యుత్తమమైన వైద్య సేవలు అందించాలని, నిరంతరం గర్భీణీలకు, చిన్న పిల్లలకు పూర్తి స్థాయిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ స్పెషల్ యూనిట్ ద్వారా మెరుగైన వైద్యం అందిచాలని అన్నారు. డెలివరీ అయిన గర్భీణీలకు, వారి పిల్లలకు ఆసుపత్రిలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రికి వైద్య సేవల కోసం వచ్చే వారి కోసం అందిస్తున్న సేవల గురించి హెల్ప్ డెస్క్ లో సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఎలాంటి వైద్య సేవలకైనా సిద్దంగా ఉండి అవసరమైతే కరోనా పీడియాట్రిక్స్, ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రి ఆవరణంలో సిసి కెమరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఆసుపత్రి ఆవరణంలో సఖీ సెంటర్ ను తనిఖీ చేసి సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ తనిఖీల్లో జిల్లా వైధ్యాధికారి డా. ఏ. మహేందర్, ఎంసిహెచ్ సూపరింటెండెంట్ డా. పి.సుగుణాకర్ రాజు, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.

Share This Post