మాతా, శిశు సంరక్షణ కేంద్రం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన,     తేది:10.12.2021, వనపర్తి.

మాతా, శిశు సంరక్షణ కేంద్రం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
శుక్రవారం వనపర్తి పట్టణం నర్సింగాయపల్లిలోని మాతా, శిశు సంరక్షణ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించి, నిర్మాణ పనులలో ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆమె తెలిపారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రం పనులను పూర్తి చేయుటకు ఈ నెల 10వ తేదీ నిర్ధారించగా, ఇప్పటి వరకు పనులలో జాప్యం అవుతున్నందున కాంట్రాక్టర్లను ఆమె మందలించారు. వారంలోగా పనులను పూర్తి చేయాలని, నిర్ధారించిన గడువు లోపల భవనం సిద్ధం చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్, సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
…………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post