మాతృత్వం ఒక వరమని, దత్తత మరొక వరమని, చిన్నారి సాయిపల్లవిని ఉత్తమరాలుగా, విద్యావంతురాలిగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

శుక్రవారం కలెక్టర్ చాంబర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా భద్రాచలం శిశు గృహాలో ఉన్న చిన్నారి సాయిపల్లవి (6 సంవత్సరాలు) దత్తత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం ఆన్లైన్ చేసిన దంపతులకు చిన్నారిని దత్తత ఇచ్చినట్లు చెప్పారు. చిన్నారిని బాగా చదివించి మంచి ఉత్తమరాలుగా  తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడే మంచి అధికారిని తయారు చేయాలని ఆయన సూచించారు. చిన్నారి సంరక్షణను మహిళా శిశు సంక్షేమ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. కలెక్టర్ చిన్నారిని ఎత్తుకుని దీవించారు. పిల్లలు లేని దంపతులకు శిశుగృహాలోని చిన్నారులను దత్తత తీసుకునేందుకు ప్రభుత్వం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. సిఏఆర్ఎ.యన్ఐసి. ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారిని సమగ్ర విచారణ నిర్వహించి తదుపరి చిన్నారులను దత్తత ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వదిలివేయబడిన చిన్నారుల ఆలనా పాలన కొరకు భద్రాచలంలో ఏర్పాటు చేయబడిన శిశుగృహాలో విద్యార్థుల సంరక్షణ చేపట్టి ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు ప్రకారం చిన్నారుల దత్తత కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పారు. చిన్నారిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు కలెక్టర్ దత్తత దృవీకరణను అందచేసి అభినందనతో పాటు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సంక్షేమ అధికారి వరలక్ష్మి, బాలల సంరక్షణ అధికారి హరికుమారి, సూపర్వైజర్ హసీనా తదితరులు పాల్గొన్నారు.

Share This Post