మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మాదకద్రవ్యాల అమ్మకాలు జరగకుండా చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలకు వంద మీటర్ల లోపల లిక్కర్ షాప్ లు ఉండకుండా చూడాలని, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో మద్యపానం సేవించకుండా చూడాలని అన్నారు. అన్ని విద్య సంస్థలు, వసతి గృహాలలో సీసీటీవీ లు ఏర్పాటు చేయాలనీ, తరచుగా వాటిని పరిశీలించి నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో బెల్టుషాపులు పాఠశాలల సమీపంలో ఉండకుండా ఎక్సయిజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉద్యోగులు మద్యం సేవించి వారి విధులకు హాజరుకాకూడదని తెలిపారు. జిల్లాలో గంజాయి సాగు, అమ్మే వారిని గుర్తించి చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయాలనీ అన్నారు. వచ్చే సమావేశం నాటికి ఆయా శాఖల అధికారులు తీసుకునే చర్యలపై నివేదికలు సమర్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డిఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, ఎక్సయిజ్, CWC సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post