వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
000
కోవిడ్ ఫ్రీ జిల్లా గా మారాలంటే వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.
మంగళవారం మానకొండూరు మండలం గట్టు దుద్దెనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరారు. మండలంలో అందరికీ కోవిడ్ వాక్సినేషన్ ఇవ్వాలని కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కార్యకర్తలను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్య ను అడిగి తెలుసుకున్నారు. బడి బయట ఉండే పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి, పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ బోధన చేయాలని అన్నారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తదితరులు ఉన్నారు.