మామిడిలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై డీలర్లకు శిక్షణ : జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్

పత్రికా ప్రకటన.    తేది:22.04.2022, వనపర్తి.

మామిడి రైతులు నష్టపోకుండా మామిడిలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్ తెలిపారు.
శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం, మదనాపురం వారి సహకారంతో మామిడి క్షేత్ర దినోత్సవం, మామిడిలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై ఇన్పుట్ డీలర్లకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా శేఖర్ అనే రైతు సాగుచేస్తున్న అధిక సాంద్రతలో మామిడి (ఎకరాకు 400 మొక్కల మామిడి దిగుబడి) విధానాన్ని ఇన్పుట్ డీలర్లకు వివరించటం జరిగిందని ఆయన తెలిపారు. మామిడి పండ్లని కాయకొట్టు ఈగ నుండి కాయలను రక్షించేందుకు ఫ్రూట్ బ్యాగ్ కవరింగ్ విధానాన్ని వివరించడం జరిగింది. ఈ విధానం ద్వారా మామిడి కాయలకు ఎటువంటి పురుగులు, తెగుళ్లు సోకకుండా, గాలి  వానలకు రాలకుండా ఉంటుందని, తద్వారా మామిడిని ఎగుమతి చేసుకొనుటకు వీలుగా, మార్కెట్ లో ఎక్కువ ధరకు అమ్మేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. దీని ద్వారా మామిడి రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రాజేంద్ర రెడ్డి, సురేష్ కుమార్, ఉద్యాన శాస్త్రవేత్తలు DHSO కె. సురేష్ లు పాల్గొని, ఫ్రూట్ బ్యాగింగ్ వల్ల కలిగే లాభాలను వివరించారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post