ప్రచురణార్థం
మారుమూల గిరిజన ప్రాంతాలలో వ్యాక్సినేషన్ శాతం సంతృప్తికరం…
మహబూబాబాద్ జూలై 8.
మారుమూల ప్రాంతాలలో నివసించే గిరిజన ప్రజలకు వ్యాక్సినేషన్ అందించడం గొప్ప విషయం అని రాష్ట్ర వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ముర్తుజా రిజ్వి సంతృప్తి వ్యక్తం చేశారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోవిడ్ నియంత్రణ పనితీరు వ్యాక్సినేషన్ కార్యక్రమం లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ వివరిస్తూ జిల్లాలో మొత్తం 2,27,098 టెస్ట్ లు నిర్వహించగా 2,14,175 ర్యాపిడ్ టెస్ట్ లు, 7,923 ఆర్టీ పిసిఆర్ టెస్ట్ లు చేయడం జరిగిందన్నారు.
సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ కు ముందు 30.4 శాతం ఉన్న పాజిటివ్ రేటును 4.1 కి తగ్గించామన్నారు.
మూడు విడతలుగా ఫీవర్ సర్వే జరిపామని 2 వేలు పల్స్ ఆక్సో మీటర్లు కొనుగోలు చేసి ప్రతి ఆశ కార్యకర్తలకు
అందించి విస్తృతంగా సర్వే చేయించామన్నారు.
జిల్లాలో 70 ఆక్సిజన్ కాన్సెంట్రే టర్స్ లను గ్రామ పంచాయతీల నుండి కొనుగోలు చేశామని మరికొన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేసుకున్నామన్నారు.
అంతేకాకుండా జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, గూడూరు, గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లు, తొర్రూరు యూపీహెచ్ సి లలో బెడ్స్ పెంచామని, అదేవిధంగా ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పించామన్నారు.
అలాగే కలెక్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వివరిస్తూ జిల్లాలో 1,66,666 మందికి విడతలవారీగా వ్యాక్సిన్ వేశామన్నారు. రెండవ డోసు కూడా 32వేల 369 మందికి వేయడం జరిగింది అన్నారు 18 సంవత్సరాల పైబడిన వారు ఇందులో 5,53,521 మంది ఉండగా 70 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 7, 91, 173 మంది ఉండగా 2లక్షల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది వ్యాక్సిన్ పొందినట్లు తెలియజేశారు.
జిల్లాలో 74 సబ్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టగా 20 పూర్తయ్యాయని 54 వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని పూర్తి అయినవి వినియోగంలోకి తెచ్చామన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ముర్తుజా రిజ్వి మాట్లాడుతూ జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన గంగారం మండలం లోని కోమట్ల గూడెం లో 47% వ్యాక్సిన్ వేయడం సంతోషించదగిన విషయం అన్నారు ఇదే స్ఫూర్తి మునుముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు . నిరుపేదలకు ఆధునిక వైద్య సౌకర్యాలను అందించేందుకు
తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా చేపడుతున్న సేవలు ప్రజలకు తెలిసే విధంగా నమూనాలను ఎక్కువగా చేపడుతూ నిరంతరంగా పనిచేయాలని వాటి ఫలితాలను కూడా త్వరగా రాబట్టి సంబంధిత పేషెంట్లకు సమాచారం అందజేయాలని అన్నారు. సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఈ సమావేశంలో వైద్య విధాన పరిషత్ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు రమేష్ రెడ్డి జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకులు వెంకట్ రాములు ఉప వైద్యాధికారి అంబరీష కోవిద్ నోడల్ అధికారి రాజేష్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
——————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది