మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు త్వరితగతిన చేపట్టాలి…

ప్రచురణార్ధం

మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు త్వరితగతిన చేపట్టాలి.

మహబూబాబాద్, అక్టోబర్,12.

జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు వేగవంతం గా విస్తరింప జేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సేవల కొరకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్, ఆర్.అండ్.బి., పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామపంచాయతీలకు నాణ్యత పరమైన ఇంటర్నెట్ సేవలు విస్తరింప జేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో 461 గ్రామ పంచాయతీ లకు గాను 131 గ్రామ పంచాయతీలకు ఫైబర్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు.

పెదవంగర మండలం లోని 20 జి.పి. లకు ఇవ్వడం జరిగిందని తెలియజేసారు.

మిషన్ భగీరథ, గ్యాస్ లైన్లు వేసి ఉన్నందున ఫైబర్ కేబుల్ వేసేటప్పుడు ముందుగా పరిశీలించుకోవాలన్నారు.అటవీశాఖ పరిధిలో ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందవల్సి ఉంటుందని అధికారులకు సూచించారు.

మండలాలలో ఎం.పి.డి.ఓ. కార్యాలయాల నుండి గ్రామ పంచాయతీలకు ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సేవలు విస్తరింప జేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం ఇంటింటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా నాణ్యత పరమైన ఇంటర్ నెట్ సౌకర్యం కలుగనున్నదన్నారు.

ఫైబర్ కేబుల్ వేసే క్రమంలో గ్యాస్ లైన్, మిషన్ భగీరథ లైన్, ఆర్.అండ్.బి., పంచాయతీ రాజ్ రోడ్స్ కు ఇబ్బంది కలుగకుండా పనులు చేపట్టాలని ఫైబర్ గ్రిడ్ ప్రతినిధులను ఆదేశిస్తూ సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్.అండ్.బి. ఈఈ తానేశ్వర్, పంచాయతీ రాజ్ ఈ ఈ సురేష్, మున్సిపల్ కమీషనర్ ప్రసన్న రాణి, ఫైబర్ గ్రిడ్ ప్రతినిధి సాయికుమార్, ఈడీఎం రంజిత్ పాల్గొన్నారు.
———————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post