మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నీతి అయోగ్ ఆకాంక్షిత జిల్లాలను ఎంపిక చేసినట్లు కేంద్ర ఉక్కుశాఖ సంయుక్త కార్యదర్శి మరియు ఆకాంక్షిత అంశాల పర్యవేక్షకులు పునీత్ కన్సాల్ తెలిపారు.

 మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నీతి అయోగ్ ఆకాంక్షిత జిల్లాలను ఎంపిక చేసినట్లు కేంద్ర ఉక్కుశాఖ సంయుక్త కార్యదర్శి మరియు ఆకాంక్షిత అంశాల పర్యవేక్షకులు పునీత్ కన్సాల్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ అనుదీప్తో కలిసి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, వైద్య, మహిళా శిశు సంక్షేమ, జిల్లా పంచాయతీ, విద్యా, విద్య, వ్యవసాయ మార్కెటింగ్, పశుసంవర్ధక, ఎల్టీయంలతో ఆకాంక్షిత అంశాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం: కల్పన కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. ఉద్యాన పంటల ఉత్పత్తులను గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అధిక పంట ఉత్పత్తులు సాధించేందు రైతులు పాటించాల్సిన అంశాలపై రైతులను క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకెళ్లాలని చెప్పారు. ఉద్యాన పంటలను అమేజాన్ ఆన్లైన్ ద్వారా విక్రయాలు నిర్వహించుటకు చర్యలు చేపట్టాలని చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులకు ఆన్లైన్ ద్వారా మంచి మద్దతు ధర లభిస్తుందని తద్వారా రైతుకు మంచి లాభాలు వస్తాయని చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన క్రింద నిరుపేద వర్గాల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేందుకు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల సహాకారంతో జాబితాను సిద్ధం చేయాలని, అట్టి జాబితాననుసరించి గ్యాస్ కనెక్షన్లు మంజూరుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రధానమంత్రి జన్ పథకం బ్యాంకు ఖాతాలు తక్కువగా ప్రారంభించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు గురించి. విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సురక్షిత మంచినీరు, మరుగుదొడ్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆకాంక్షిత ఇండికేటర్లు అప్లోడ్ చేయడంలో గ్యాప్ రాకుండా చూడాలని, ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు.

 

జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మ రాష్ట్రంలో భద్రాద్రి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలను నీతి ఆయోగ్ ఆకాంక్షిత జిల్లాలుగా ప్రకటించినట్లు చెప్పారు. జిల్లాలో పోషకాహార లోపంతో భాదపడుతున్న చిన్నారులను గుర్తించి న్యూట్రిషన్ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. గిరిజనులు, ఆదివాసీ గ్రామాలు అత్యధికంగా ఈ జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న తల్లి, పిల్లలను గుర్తించి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు జిల్లాలో చిరుదాన్యాల సాగు చేపట్టామని, పండిన పంటను అంగన్వాడీ కేంద్రాల్లో వినియోగించనున్నట్లు చెప్పారు. గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు చిరుదాన్యాలతో చేసిన ఆహార పదార్ధాలను అందిస్తున్నట్లు చెప్పారు. పోషణ మాసం నిర్వహించి చిరుదాన్యాలతో తయారు చేయు వంటకాలను తల్లులకు వివరించినట్లు. చెప్పారు. ప్రతి బుధవారం తల్లులను, సర్పంచులను అంగన్వాడీ కేంద్రాలకు రప్పించి వారి సమక్షంలో పిల్లల బరువు, ఎత్తును పరిశీలన చేయడంతో పాటు తల్లులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటి స్కాన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత జిల్లాగా ప్రకటించి ఎంపిక చేసిన శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై మరింత ఫోకస్ చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఆయా శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల అమలును అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

 

సమావేశంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, పంచాయతీరాజ్ ఈఈ సుధాకర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, డిపిఓ రమాకాంత్, ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, పశుసంవర్ధక అధికారి డాక్టర్ పురందర్, పరిశ్రమల శాఖ జియం సీతారం, ఎలీయం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post