మారుమూల ప్రాంతాలలో ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయాలి…

ప్రచురణార్థం

మారుమూల ప్రాంతాలలో ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయాలి…

మహబూబాబాద్ డిసెంబర్ -24:

మారుమూల ప్రాంతాలలో ఉద్యోగుల ఖాళీలను తప్పనిసరిగా భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఉద్యోగుల విభజన బదిలీలు, చేరికలపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగుల విభజనానంతరం చేపట్టిన బదిలీలు, చేరికలపై మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. బదిలీల ప్రక్రియ
పూర్తయిన తర్వాత ఉద్యోగుల వివరాలను ఆయా శాఖల నోటీస్ బోర్డ్ పై ఉంచుతూ, కలెక్టర్ కార్యాలయంలోని నోటీస్ బోర్డ్ పై కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉన్నతాధికారులు సీనియార్టీ ప్రకారం గానే విభజన చేయడం జరిగిందని, ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల సీనియారిటీ ప్రకారం స్థానాలను సూచిస్తూ నివేదికలు అందజేయాలన్నారు. ఉద్యోగుల కేటాయింపుకు పేర్లు, హోదా లతో నివేదిక రూపొందించాలని అన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట సిబ్బంది కేటాయింపు కూడా ఎక్కువగానే చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, కొమరయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post