మారుమూల ప్రాంతాల అభివృద్ధికి చర్యలు … జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

ప్రచురణార్ధం

మారుమూల ప్రాంతాల అభివృద్ధికి చర్యలు …

మహబూబాబాద్, జూలై,15.
మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో ములుగు శాసనసభ్యురాలు సీతక్క (ధనసరి అనసూయ) నియోజకవర్గ మండలాలైన కొత్తగూడ, గంగారం సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీశాఖ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని, రోడ్లు నిర్మాణాలకు గాను పనులు వేగవంతం చేయిస్తూ తాత్కాలికంగా గుంతలు పూడిపించేందుకు, బి.ఎస్.ఎన్.ఎల్. సిగ్నల్ సమస్యల పరిష్కారం కొరకు జియో ఏర్పాటుకు, కొత్తగూడ లో ఇండియన్ బ్యాంక్ ఇబ్బందులను తొలగింపుకు జి.సి.సి. బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం మారుమూల ప్రాంతాల సమస్యల పై విజ్ఞాపన పత్రాన్ని ప్రజాప్రతినిధులు కలెక్టర్ కు అందజేశారు.
—————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post