మారుమూల ప్రాంతాల ప్రగతే ప్రభుత్వ లక్ష్యం – రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రచురణార్థం-1
తొర్రూర్/ మహబూబాబాద్ 21 సెప్టెంబర్-2021:
మారుమూల ప్రాంతాల ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని విధాలుగా పని చేస్తుందని పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
మంగళవారం ఉదయం తొర్రూర్ మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలో 2కోట్ల వ్యయంతో మూడు తండాలగు దశ్రు, ఎల్ బి, కెవుల ఖండాలను కలుపుతూ తొర్రూర్ మున్సిపల్ కేంద్రానికి సులభమైన మార్గం కోసం PMGSY బి టి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొర్రూర్ కు వెళ్లాలంటే తండావాసులు అత్యవసర పరిస్థితుల్లో సరైన రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు దృష్టికి వచ్చిందని, వెంటనే 2 కోట్ల వ్యయంతో పన్నులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వినూత్న పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పాట పడుతుందని అన్నారు. జలకళతో నిండుకుండలా పల్లెలు పచ్చ తోరణాలతో అములుకు ఉన్నాయని, 24గంటల నాణ్యమైన కరెంటు ఇస్తూ సంవత్సరానికి ఒక మోటార్ కు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వమే రైతుల తరపున చెల్లిస్తుందని, గరిష్టంగా 18 వందల రూపాయలతో కింటా వడ్లను కొన్న ఏకైక ప్రభుత్వం మనది అని, రైతులు సన్న ఒడ్లు వేసుకోవాలని సూచించారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లతో పేదింటి కష్టాలను తీరుస్తుందని, ఆసరా పెన్షన్ ల తో ప్రజల బాగోగులు చూస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మనది అన్నారు. రైతులు పామాయిల్ సాగు చేసుకోవాలని మరింత అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో గుర్తుల్లో 30 ఎకరాలు సాగు చేస్తున్నట్లు గోపల గిరి లో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు, పామాయిల్ సాగు లో అంతర్ పంటలు కూడా వేసుకునే అవకాశం ఉందని అన్నారు.
2 కోట్లతో నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులను 6 నెలల్లోగా పూర్తిచేయాలని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ EE సురేష్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కమిషనర్ గుండె బాబు, ఎంపీపీ చిన్న అంజయ్య , జెడ్ పి టి సి మంగళపల్లి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి, కౌన్సిలర్ గుగులోతు శంకర్, సర్పంచ్ లింగన్న గౌడ్ ఎంపిటిసి జాటోత్ సుజాత, మాజీ ఎంపీపీ కర్ర సోమయ్య, కో ఆప్షన్ నెంబర్ అంకుస్, అధికారులు ప్రజా ప్రతినిధులు తండావాసులు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం మహబూబాద్ గారి జారీ చేయడమైనది

Share This Post