మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంట మార్పిడి పద్ధతులు పాటించాలి అవగాహన సదస్సులో మంత్రులు నిరంజన్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి

నల్గొండ,జూన్ 1 : వ్యవసాయం లో సాంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలుకుతూ,ప్రపంచ పోకడలకు అనుగుణంగా నూతన వ్యవసాయ పద్ధతులు అనుసరించి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అన్నారు.. వానా కాలం సీజన్లో పంటల సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రం లో లక్ష్మి గార్డెన్ లో  నల్గొండ,భువన గిరి జిల్లాల  సదస్సు నిర్వహించారు.ఈ అవగాహన సదస్సు కు ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరవగా,  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి,రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,నల్గొండ జడ్పీ చైర్మన్  బండ నరేందర్ రెడ్డి, ఎం ఎల్ సి ఎం.సి.కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి,రవీంద్ర కుమార్,భాస్కర్ రావు,చిరు మర్తి లింగయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత్ కె. జెండగీ,ఆయిల్ పెడ్ చైర్మన్ రామ కృష్ణా రెడ్డి,రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు రాం చంద్ర నాయక్ నల్గొండ,భువనగిరి జిల్లాల కలెక్టర్లు  ప్రశాంత్ జీవన్ పాటిల్, పమేలా సత్పతి లు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, కాలానికి అనుగుణంగా మార్పులను స్వాగతిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. నూతన పద్ధతుల్లో  పంటల సాగు చేపటలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సూచించారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతుని మించిన శాస్త్రవేత్త లేడని, వారికి కాస్తంత ఊతమందిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. వరి వంటి సాంప్రదాయ పంటలకు భిన్నంగా మార్కెట్ అవసరాలను గమనిస్తూ డిమాండ్ ఉన్న పంటలను ఆధునిక పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో పండిస్తూ, ఎక్కువ దిగుబడులు సాధించి లాభాల బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులను నిర్వహిస్తోందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం, ప్రత్యేకించి రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి  కె చంద్రశేఖర రావు అహరహం కృషి చేస్తున్నారని అన్నారు. దేశానికి అన్నెం పెట్టే రైతు ను ప్రతి ఒక్కరూ గౌరవించు కావాలని అన్నారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత,రాష్ట్రం ఏర్పాటు కు ముందు వ్యవసాయ రంగం అవలోకనం చేసుకుంటే రోజు వ్యవసాయ రంగం లో రాష్ట్రం ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు ప్రవేశ పెట్టిన పథకాల వలన అధ్బుతంగా పురోగమిస్తోందని అన్నారు. వాన కాలం సీజన్ లో పంజాబ్ రాష్ట్రం 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తే రాష్ట్రం 2021 లో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశం లో అగ్ర స్థానం లో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్,సాగు నీరు,పెట్టు బడి సాయం అందిస్తోందని అన్నారు.బీడు భూములను సాగు భూములు గా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు కే దక్కుతుందని అన్నారు. ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయని,అందుకు అనుగుణంగా.రైతులు అవసరమైన ఉద్యాన పంటలు పై దృష్టి సారించాలని అన్నారు .ప్రపంచం లో వచ్చిన నూతన పోకడలు మనం వినియోగించు కో అన్నారు.దేశం లో నూనె గింజల కొరత వుందని,రెండింతలు ఉత్పత్తి పెంచాలని,రైతులకు వ్యవసాయ అధికారులు వివరించాలని,నూనె గింజల కు మార్కెట్ ఉందనీ అన్నారు. వానా కాలం లో 2 లక్షల మొక్కలు నర్సరీ లలో పెంచుతున్నట్లు,14 నెలల ముందు నుండి విదేశాల నుండి విత్తనం తెప్పించి నర్సరీ లలో మొక్కలు సిద్దం చేసినట్లు తెలిపారు. 2 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం గా రైతులను సాగుకు ప్రోత్స హించనున్నట్లు తెలిపారు   కూరగాయలు పండించాలని, రానున్న రోజుల్లో 10 లక్షల ఎకరాలకు ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందని అన్నారు.  ఆయిల్ ఫామ్ గెలకు టన్నుకు 24 వేల రూ.లు వుంది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ కు ఉన్న డిమాండ్ వుంది.క్రూడ్ ఆయిల్ కు ధర పెరుగుతూనే వుంది తగ్గదు అని చెప్పారు ఆయిల్ ఫామ్ తోటలకు రైతులకు సుస్థిర ఆదాయం వస్తుందని అన్నారు.ప్రస్తుతం దేశం లో 70 లక్షల టన్నుల నూనె ఉత్పత్తి అవుతోందని,2 కోట్ల 10 లక్షల టన్నుల నూనె దేశం లో అవసరం వుందని అన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని అన్నారు. సంవత్సరం కు 80 నుండి 90 వేల కోట్ల రూపాయలు వెచ్చించి నూనెలు దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు.ఆయిల్ ఫామ్ నుండి 148 రకాల ఉప ఉత్పత్తులు వస్తాయని అన్నారు.పత్తికి మంచి డిమాండ్ వుందని,ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ 4 కోట్ల 56 లక్షల పత్తి బేల్స్ కొనటానికి సిద్దంగా ఉన్నారని,3 కోట్ల 80 లక్షల బేల్స్   మాత్రమే దేశం లో ఉత్పత్తి వుందని అన్నారు. అంతర్జాతీయ దిగుబడుల సరసన మన దిగుబడులు చేరాలి,మన అవసరాలు తీరిన తర్వాత ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని అన్నారు.
         స్థానిక పరిస్థితులకు తగినట్టుగా కార్యచరణ ప్రణాళికను రూపొందించి, క్షేత్ర స్థాయిలో అమలు అయ్యే విధంగా పని చేయాలని అధికారులకు సూచించారు. ఒకే పంటని వేయడం వలన భూసారం తగ్గిపోయి దిగుబడి తగ్గుతుందని అన్నారు. పంట మార్పిడి చేపట్టి  లాభదాయక సాగుకు ప్రాధాన్యత ఇస్తూ దిగుబడి పెంచే దిశగా కృషి చేయాలన్నారు.  ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా కృషి చేయాలని అన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి పై విజయ గాధలను అందించాలని అన్నారు.. .ఇక ఆముదం పంటకు కూడా అద్భుతమైన లాభాలు వస్తాయని అన్నారు
రాష్ట్ర విద్యుత్ శాఖ
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ
అధునాతన  వ్యవసాయ విధానాలను ఎంచుకోవడం లో రైతులు ముందు వరుసలో ఉండాలన్నారు.రైతులకు అన్ని విధాలా అండగా ఉండేలా వ్యవసాయ అధికారులు  సంసిద్దంగా ఉండాలి.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు  అన్ని జిల్లాలు తిరుగుతూ  వర్క్ షాప్ లను నిర్వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం  వచ్చిన్నంక వ్యవసాయ రంగంలో  నల్గొండ జిల్లాకు   ఎక్కువగా   లాభం జరిగింది .అది అంత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లనే……2014 కు ముందు రైతులు  కరంట్ కోసం ధర్నాలు చేస్తుండే,,, కానీ ఇవ్వాళ 24 గంటల ఉచిత కరంట్  ను ఇస్తున్న ఘనత  ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు.ఎలా వున్న నల్గొండ జిల్లా గతం కు ఇప్పుడు ఎలా మారింది  మనం కళ్లారా చూస్తున్నం.నీళ్ల కోసం ఆకాశం వైపు దినంగా చూసే పరిస్థితి నుంచి  నల్గొండ ఇవ్వాళ   పచ్చగా సస్యశ్యామలం గా మారింది..జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లోరైడ్ కేస్ నమోదు కాలేదు… ఈ అద్భుతాన్ని అవిషరించింది ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి  పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ను నిర్మించడంతో ఉమ్మడి  జిల్లాలో  చివరి భూములకు కూడా నీరు అందుతుంది..రైతు బంధు పథకం తో పెట్టుబడి అందిస్తున్నారు..రైతు బంధు సమితి లను ఏర్పాటు చేసి, రైతులను సంఘటితం చేశారు..రైతులు లక్ష్యధికారులు కావలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.ధాన్యం మొత్తాన్ని కొంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అన్నదాతలు ఎకరానికి లక్ష రూపాయల ఆదాయాన్ని  సంపాదించాలన్నది ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు లక్ష్య మని అన్నారు.
రాష్ట్ర శాసన మండలి  ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర
ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్  కృషి వల్ల   రాష్ట్రం లో వ్యవసాయం పండుగలా మారిందని,ఆహార ఉత్పత్తి లో తెలంగాణ నంబర్ 1 స్థానం లో ఉన్నది.  4000 కోట్ల రూ.లు నస్థం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసి రైతులను ఆదుకుందని అన్నారు                   రాష్ట్ర రైతు బందు సమితి అధ్యక్షులు
పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు కృషి వల్ల వ్యవసాయ శాఖకు ఇవ్వాళ  గౌరవం , స్థానం పెరిగిందనీ అన్నారు… గత సమైక్య ప్రభుత్వం లో వ్యవసాయ శాఖను జీవచ్చవంలా మార్చారు.ఇవ్వాళ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ  అధికారిని నియమించారు. రైతు భందు సమితి సబ్యులకు,  సముచిత గౌరవం కల్పిస్తూ ఫ్రొటో కాల్ ఉండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.రైతులకు 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.రైతు బంధు ద్వారా ఇప్పటికీ 7 సార్లు రైతుల ఖాతాల్లో  పెట్టుబడి సాయం జమ చేసినట్లు తెలిపారు.
      ఆధునికత విషయాలపై రైతులకు సరైన దిశగా అవగాహన కలిపించాలని అధికారులకు సూచించారు.
    జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ వానా కాలం సాగుకు రైతు ను సమాయత్తం చేసేందుకు ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని అన్నారు. రైతులతో రైతు బంధు సమితి సభ్యులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయని, అందువల్లే ఈ సదస్సులలో వారికి పంటల సాగు యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆకళింపు చేసుకుని, తమతమ ప్రాంతాల రైతులకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తూ వారిని ఆధునిక సాగు, పంటల మార్పిడి దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు.
ఈ సదస్సులో వ్యవసాయ శాఖ జె.డి.సుచరిత,వ్యవసాయ శాఖ ఏ.డి.హుస్సేన్ బాబు ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంట మార్పిడి పద్ధతులు పాటించాలి
అవగాహన సదస్సులో మంత్రులు నిరంజన్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి
రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి

Share This Post