మార్క్ ఫెడ్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మార్క్ ఫెడ్ కార్యాలయ నూతన భవనాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, ఎం ఎల్ సిలు వి.గంగాధర్ గౌడ్, రాజేశ్వర్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, హన్మంత్ సిందే, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, జిల్లా కలెక్టర్లు సి నారాయణ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ఆకుల లలిత, నగర మేయర్ నీతూ కిరణ్, డీ సి సి బీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఐడిసిఎంఎస్ చైర్మన్ మోహన్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, రెడ్ కో చైర్మన్ అలీం, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
————————–

Share This Post