మార్చి చివరి నాటికి మెడికల్ కళాశాల తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం-1 తేదీ.12.11.2021
మార్చి చివరి నాటికి మెడికల్ కళాశాల తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల, నవంబర్ 12:-
మార్చి 2022 చివరి వరకు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాల కోసం తాత్కాలిక భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, ఎంసిహెచ్ ఆసుపత్రి లోని అదనపు పడకల భావన నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులో వేగం పెంచి మెడికల్ మొదటి సంవత్సర విద్యార్థులకు అందుబాటులొ ఉండే విధంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మెడికల్ కళాశాల భవనం తాత్కాలికంగా నిర్మించేందుకు ప్రభుత్వం రూ.11.5 కోట్లు మంజూరు చేసిందని, ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులును ఆదేశించారు.
జిల్లాలో ఉన్న ఎంసిహెచ్ విస్తరణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జగిత్యాల జిల్లాలో ఉన్న ఎంసిహెచ్ 330 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం జరుగుతుందని అధికారులు వివరించారు. వీటి నిర్మాణం కై రూ.6.1 కోట్ల నిధులతో ప్రస్తుతం ఉన్న 250 పడకల ఆసుపత్రి పైన మరో ప్లోర్ నిర్మిస్తు అదనంగా 80 పడకల సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని, ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంసిహెచ్ విస్తరణ పనులు వీలైనంత త్వరగా నాణ్యత అంశంలో రాజీ లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని, అనాటమీ హల్ లను సందర్శించారు.
ఆర్&బి ఈఈ శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ సుదక్షణదేవి, ఆర్.ఎం.ఓ.రామకృష్ణ, టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి. అధికారులు , తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాలచే జారీ చేయనైనది

Share This Post