మార్చి లోగా కస్టమ్డ్ రైస్ మిల్లింగ్ పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ రమేష్

మార్చి లోగా కస్టమ్డ్ రైస్ మిల్లింగ్ పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ రమేష్

జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్న అకౌంటంట్, ఏ.యెన్.ఏం. ఉద్యోగాల భర్తీకై అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సమగ్ర శిక్ష ఎక్స్ అఫిషియో జిల్లా ప్రాజెక్ట్ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోనై సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడపబడుచున్న కె.జి.బి.వి. విద్యాలయంలో మూడు అకౌంటంట్, 4 ఏ.యెన్.ఏం. పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కొల్చారం, వెల్దుర్తి, కోమటిపల్లి, చిప్పలతుర్తి కె.జి.బి.వి. లలో ఒక్కో ఏ.యెన్.ఏం చొప్పున, శివంపేట్, చిప్పలగతుర్తి, చేగుంట లలో ఒక్కో అకౌంటెంట్ చొప్పున పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని అయన వివరించారు. ఏ.యెన్.ఏం. పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏ.యెన్.ఏం. శిక్షణ సర్టిఫికెట్, అకౌంటెంట్ లకైతే కామర్స్ లో డిగ్రీ తో పాటు బేసిక్ కంప్యూటర్ లో నైపుణ్యం కలిగి ఉండాలని అన్నారు. అభ్యర్థులు జిల్లాకు చెందిన వారి 18-35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని అన్నారు. కాంట్రాక్ట్ పద్దతిలో 11 మాసాల కోసం నియామకం జరిగే ఇట్టి పోస్టులకు ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫారంతో పాటు విద్యార్హతలు, బోనఫైడ్, కుల, రెసిడెన్షియల్ ధ్రువపత్రాలతో ఈ నెల 31 సాయంత్రం 5 గంట్లలోగా జిల్లా మెదక్ లోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరునట్లు పంపాలని రమేష్ సూచించారు. వివరాలకు 7981856798, 7893308762 లేదా 9492039644 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Share This Post