మార్పు తోటే సరికొత్త ఆలోచన ఉద్భవిస్తుంది….

ప్రచురణార్థం

ఖైదీ లందరూ సంతోషంగా ఉండాలని జైలు జీవితం ప్రశాంతంగా గడపాలని, మార్పు తోటే సరికొత్త ఆలోచన ఉద్భవిస్తుందని ఆరవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిల్ కిరణ్ కుమార్ తెలిపారు.

శనివారం మున్సిపల్ పరిధి తొర్రూర్ రోడ్డు లోని జిల్లా జైల్లో అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకొని ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఆరవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు.
క్షణికావేశంలో అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకో రాదన్నారు.
ఆలోచనతోనే మార్పు వస్తుందని జైలు జీవితం ప్రశాంతతనిస్తుందని సత్ప్రవర్తన తోనే సన్మార్గంలో పయనించి జీవితాలను సరిదిద్దుకోవాలి అన్నారు.

జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ
జీవితంలో అత్యంత విలువైనది సమయమని, గడచిన కాలం తిరిగి రాదని ఇది ప్రతి ఒక్కరూ గుర్తించి నడుచుకోవాలన్నారు. గాంధీజీ తన జీవితమే ఒక సందేశంగా అందించినట్లు తెలియజేశారు నిగ్రహంతో ఆగ్రహావేశాలకు లోనుకాకుండా నియంత్రించు కోవాలన్నారు. ప్రతి ఒక్కరికి ఓపిక ప్రధానమని మంచి ఆలోచన జ్ఞానాన్ని పెంపొందిస్తుందన్నారు. జైల్లో కూడా సమయాన్ని వృధా చేయక ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టాలని సన్మార్గం పెంపొందేలా మరిన్ని కార్యక్రమాలను రూపొందించుకోవాలి అన్నారు. పెట్రోల్ బంకు క్యాటరింగ్ వంటి కార్యక్రమాల్లో రాణించడం విశేషమన్నారు పెట్రోల్ బంకు ఏర్పాటుకు సహకారమే అందజేస్తామన్నారు.

అనంతరం వాలీబాల్ బ్యాడ్మింటన్ చెస్ క్యారమ్స్ తదితర క్రీడా పోటీల్లో విజేతలైన ఖైదీలకు బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఏఆర్ వింగ్ డి ఎస్ పి జనార్దన రెడ్డి జైళ్ల శాఖ పర్యవేక్షకులు గోపి రెడ్డి జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకులు వెంకటరమణ ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.
———————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post