మార్లవాయి గ్రామాభివృద్ధికి అన్ని విధాల కృషి : ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు సోయం బాపురావు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సoసాద్‌ ఆదర్శ గ్రామయోజన పథకం క్రింద జిల్లాలోని మార్లవాయి గ్రామపంచాయతీ ఎంపిక కావడం సoతోషకరమని, గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు సోయం బాపురావు అన్నారు. మంగళవారం జిల్లాలోని మార్లవాయిలో గ్రామ సర్చంచ్‌ కనక ప్రతిభ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామనభలో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌. జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మీ, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ శాసననభ్యులు ఆత్రం సకలిని హాజరయ్యారు. ఈ సoదర్భంగా పార్లమెంట్‌ నభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకానికి మార్లవాయి ఎంపిక కావడం సoతోషంగా ఉందని, పథకంలో భాగంగా చేపట్టే సoక్షేమ కార్యక్రమాల గురించి అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేసి అందిస్తే సoబంధిత నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పథకం అమలుతో గ్రామాభివృద్ధి కోనం సoబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సoసాద్‌ యోజన పథకంలో గ్రామంలో మౌళిక వసతులు, వైద్య, వైద్యం, న్వయం ఉపాధి తదితర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. కరోనా వైరన్‌ నియంత్రణ కోసo ఆదివాసీలు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్చంధీగా చేపట్టడం ద్వారా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండవచ్చని, వ్యక్తిగత పరిశుభతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో విద్య, వైద్యం, న్వయం ఉపాధి కోసo కేంద్రం ద్వారా నిధులు మంజూరు అయ్యే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలని, రైతులు వర్షాధారం క్రింద ఒకే పంటపై ఆధారపడుతున్నారని, రెండవ పంట సాగు చేసే విధంగా నీటి పథకాలు, బోర్లు, మోటార్లు తదితర సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కుమంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post