*మాస్కు లేకుండా వచ్చిన భక్తులను లోపలికి అనుమతించకూడదు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*మాస్కు లేకుండా వచ్చిన భక్తులను లోపలికి అనుమతించకూడదు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం-3*

*వేములవాడ బస్టాండ్, పార్కింగ్ స్థలాల్లో ప్రత్యేకంగా కోవిడ్ పరీక్షల నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి*

*ఆలయ సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలి*

*కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలి*

*రెవెన్యూ, ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్*

రాజన్న సిరిసిల్ల, జనవరి 10: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వేములవాడ ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించేలా ఆలయ అధికారులు సూచించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వేములవాడ ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయంలోని సిబ్బంది అందరూ వ్యాక్సిన్ రెండు డోస్ లు వేసుకున్నారా లేదా అని పరిశీలించాలని అధికారులకు సూచించారు. తప్పనిసరిగా సిబ్బంది వ్యాక్సిన్ రెండు డోస్ లు వేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు మాస్కులు లేకపోతే లోపలికి అనుమతించకూదని అధికారులకు సూచించారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. వేములవాడ బస్టాండ్, అలాగే వాహనాల పార్కింగ్ స్థలాల్లో కోవిడ్ పరీక్షల నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు పరీక్షలు చేయాలని ఆదేశించారు. సిబ్బందికి కూడా నిర్ధారణ పరీక్షలను చేయాలని సూచించారు. ముక్కోటి ఏకాదశి వేడుకల్లో ఆలయంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరపాలని అన్నారు. భక్తులను ఆరోజు దర్శనానికి మాత్రమే అనుమతించాలని సూచించారు.

ఈ సమీక్షలో వేములవాడ ఆర్డీఓ వి. లీల, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post