ప్రచురణార్థం
మిగిలిన దళిత బంధు యూనిట్ లు వెంటనే గ్రౌండింగ్ పూర్తి చేయాలి … జిల్లా కలెక్టర్ కె. శశాంక.
మహబూబాబాద్, ఏప్రిల్ -29:
మిగిలిన దళిత బంధు యూనిట్ లు వెంటనే గ్రౌండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక డోర్నకల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, గ్రౌండింగ్ కమిటీ టీమ్ తో గ్రౌండింగ్ చేయవలసిన దళిత బంధు యూనిట్ లపై సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, డోర్నకల్ నియోజకవర్గంలో 100 యూనిట్ లకు గాను ఇప్పటి వరకు 78 మంజూరు చేసుకున్నామని, మిగిలిన 22 యూనిట్ లు మంజూరు చేసుకొని వెంటనే గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. ప్రతి రంగానికి ఒక రిసోర్స్ పర్సన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రిసోర్స్ పర్సన్ యూనిట్ ఏర్పాటుకు కావలసిన సౌకర్యాలు, ఫర్నీచర్, ఇతర అంశాలపై వర్కౌట్ చేయాలని, క్రొత్తగా ఇంకా ఏ రంగానికైన రిసోర్స్ పర్సన్ నియమించుకోవలసి ఉన్నదా అని అడిగి తెలుసుకున్నారు. మంజూరైన యూనిట్ లకు సంబంధించి మొత్తంను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని తెలిపారు.
మంజూరైన మినీ డైరీ, కోళ్ల పరిశ్రమ కోసం ఏర్పాటు చేస్తున్న షెడ్ ల నిర్మాణం పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో ఈ.డి. ఎస్సీ కార్పొరేషన్ బాలరాజు, పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్ టి. సుధాకర్, డోర్నకల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, గ్రౌండింగ్ కమిటీ టీమ్ మెంబర్ లు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.