మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 8: పాలనా సౌలభ్యం కొరకు నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవనాన్ని తనిఖీ చేశారు. ఆధునిక సౌకర్యాలతో అధికారుల, సిబ్బంది గదులు, సమావేశ మందిరం, దృశ్య శ్రవణ మందిరం అన్ని కలియదిరిగి పరిశీలించారు. భవనంలోని మంత్రి చాంబర్ ని పరిశీలించారు. మిగులు చిన్న చిన్న పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. ఫర్నీచర్ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. గ్రీనరీ, నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గ్రీనరీకి డ్రిప్ ఏర్పాటుచేయాలన్నారు. అవకాశం వున్న చోట మరిన్ని మొక్కలు నాటాలని, కలుపు మొక్కలు తొలగించాలని ఆయన అన్నారు. సమావేశ మందిరంలో దూర శ్రవణ యంత్రాల ఏర్పాటుచేయాలన్నారు. భవన సముదాయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. భవన సముదాయంలో ప్రవేశం, నిష్క్రమణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మిగులు గ్రావెల్ ఫిల్లింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, డిఆర్డివో జి. రాంరెడ్డి, ఆర్ అండ్ భి ఇఇ హుస్సేన్, జనగామ మునిసిపల్ కమీషనర్ నర్సింహా, ఫారెస్ట్ రేంజ్ అధికారి సదానందం, అధికారులు తదితరులు వున్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post