మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా” పిలుపుమేరకు 2016 సంవత్సరం నుండి ప్రతి మే 16వ తేదీన “నేషనల్ డెంగీ వ్యాధి దినోత్సవం” జరుపుకుంటున్నాం.

పత్రికా ప్రచురణార్థం🌷
Dt 14-05-2022

“మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా” పిలుపుమేరకు 2016 సంవత్సరం నుండి ప్రతి మే 16వ తేదీన “నేషనల్ డెంగీ వ్యాధి దినోత్సవం” జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం “చేయి చేయి కలుపుదాం – డెంగీ వ్యాధిని నివారిద్దాం” అనే నినాదంతో ప్రజ లను చైతన్యవంతులను చేసేందుకు పెద్ద ఎత్తున ఎస్.ఆర్.ఆర్ తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నుండి ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ తెలియజేశారు. డెంగీ వ్యాధి ప్రాణాంతకమైనది. ఇది నివారించదగినది. ఈ యొక్క వ్యాధి విస్తరణ ఈడిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఈ యొక్క దోమల పెరుగు స్థావరాలు మానవ విసర్జితాలైన వాడి పడేసిన కప్పులు, ప్లాస్టిక్ బకెట్లు, టైర్లు, కూలర్లు, పూలకుండీలు, ఆరుబయట ఉన్నటువంటి రోళ్ళు, నీటి నిలువ పాత్రలు. వీటినీ ఎప్పటికప్పడు నిలిచియున్న నీళ్లను పడేసి వారంలో ఒకసారి నీటి వాడకం పాత్రలను కడిగి శుభ్రం పరిచి నీళ్లు పట్టుకున్నట్లు అయితే ఈడీస్ దోమల పెరుగుదలను అరికట్టవచ్చని తెలియజేశారు.
డెంగీ వ్యాధి 2019 సం: 103 కేసులు, 2020 సం: 11 కేసులు, 2021 సం: 18 కేసులు, 2022 సం: జనవరి నుండి ఏప్రిల్ వరకు 24 కేసులు నమోదు అయినవి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన కాశిబుగ్గ కిలా వరంగల్ పైడిపల్లి ఆరోగ్య కేంద్రాలలో అధిక కేసులు నమోదు కావటం జరిగిందని, ఇంతవరకు ఎటువంటి మరణాలు సంభవించిన లేదని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్ తెలియజేశారు.

Share This Post