*మినీ స్టేడియం సందర్శించిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*మినీ స్టేడియం సందర్శించిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*ప్రచురణార్దం-1*
జనగామ నవంబరు 23: స్థానిక ధర్మకంచె లోని మినీ స్టేడియాన్ని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మంగళవారం సందర్శించారు. స్టేడియంలో ఏ ఏ ఆటలకు సంబంధించి సదుపాయాలు ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. స్టేడియంలోని జిమ్, షటిల్ కోట్ లలో ఉన్న సామగ్రి పరిశీలించారు. యువత స్టేడియాన్ని మరింతగా ఉపయోగించుకొనేలా సౌకర్యాలు అభివృద్ధి పర్చాలన్నారు. క్రీడా మైదానంలో పిచ్చి చెట్లు, పొదలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వాకింగ్ ట్రాక్ మరమ్మత్తులు చేపట్టాలన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి గోపాల్ రావు, మునిసిపల్ కమిషనర్ కె. నర్సింహ తదితులున్నారు.

Share This Post