మిర్చి రైతులకు సహకరించాలి::జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యు)ఎం.డేవిడ్

మిర్చి రైతులకు సహకరించాలి::జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యు)ఎం.డేవిడ్

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఫిబ్రవరి.2

మిర్చి రైతులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు.

గురువారం అదనపు కలెక్టర్ (రెవెన్యు) ఎం.డేవిడ్ అద్యక్షతన కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా పౌర సరఫరాల శాఖ అద్వర్యంలో జిల్లా వినియోగ దారుల సమాచార అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం (PCIC) నందు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారాలు మొదలగు అంశములపై విపులంగా చర్చించి మిర్చిపంటకు గిట్టుబాటు ధరను అందిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఎండాకాలం దృష్ట్యా మిర్చి మార్కెట్ యార్డులలో వినియోగదారులకు అవసరమైన వాటర్, ఎలక్ట్రిసిటీ, వంటి వసతుల కల్పనకు సంబందిత అధికారులకు చర్యలకై ఆదేశించారు.

వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

జిల్లాలోని హాస్టల్లలో నిల్వ ఉన్న బియ్యాన్ని సంబందిత అధికారులతో, స్కూల్ ప్రిన్సిపాల్ లతో మాట్లాడి 20 నుండి 25 రోజులలో క్లియర్ చేపించేందుకు చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో , జెడ్పి సీఈఓ రమాదేవి, పౌరసరపరాల అధికారి నరసింగరావు, డిసిఐసి ఇంచార్జ్ అధికారి సుధాకర్, డిసిఐసి మెంబర్ ఎస్.కె. జానీ తదితరులు పాల్గొన్నారు.

Share This Post