మిల్లర్లు సహకరించాలి…

ప్రచురణార్ధం

మిల్లర్లు సహకరించాలి…

మహబూబాబాద్, డిసెంబర్,02.

ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లను జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం దిగుమతి పై మిల్లర్లు తో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం దిగుమతి చేసుకోవడంలో మిల్లర్లు సహకరించాలని దిగుమతి వేగవంతంగా చేయించాలని కోరారు.

జిల్లాలో రా రైస్ మిల్లులు, పార బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయన్నారు.

ధాన్యంలో నాణ్యత ఉంటేనే కొనుగోలు చేస్తామని, ధాన్యం నాణ్యత పై ఎటువంటి సందేహం అక్కర్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

స్థలం కొరత వంటి కారణాలు సబబు కాదని, కావాలంటే ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామన్నారు.

మిల్లర్లు హమాలీల సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య, సివిల్ సప్లైస్ డి.ఎం.మహేందర్, పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, విద్యుత్ శాఖ ఏ.ఈ. స్వర్ణ లత మిల్లర్లు నాగేశ్వరరావు అంబరీష దామోదర్ కృష్ణమూర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
———————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post