మిల్లుల్లో ధాన్యం కోతలు జరుగకుండా రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ……. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మిల్లుల్లో ధాన్యం కోతలు జరుగకుండా రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ……. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మిల్లుల్లో ధాన్యం కోతలు జరుగకుండా రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ……. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -20:

కొనుగోలు కేంద్రంలో శుభ్రపరిచి తేమ శాతం వచ్చిన ధాన్యం మిల్లుల్లో కటింగ్ కాకుండా, రైతులు నష్టపోకుండా చూడాల్సిన భాద్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ కే శశాంక అన్నారు.

శుక్రవారం ఉదయం మహబూబాబాద్ మండలం అనంతారం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కొనుగోలు కేంద్రం కు వచ్చిన ధాన్యాన్ని ప్యాడి క్లీనర్ యంత్రాల సహాయంతో శుభ్రపరుచుకొని, రోజు ఉదయం ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి, వెంటనే మిల్లులకు రవాణా చేయుటకు ఇన్చార్జిలు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని, ధాన్యాన్ని శుభ్రపరచడం వల్ల ఏలాంటి సమస్యలు తలెత్తవని, వీలైనంత త్వరగా ధాన్యాన్ని ప్యాడి సెంటర్ నుంచి తరలించేందుకు రవాణ కొరకు లారీలను, ట్రాక్టర్లను, అధికారులే ఏర్పాటు చేయాలని, సెంటర్ ఇన్చార్జులు ఎప్పటికప్పుడు ట్రక్ షీట్ తీసుకోవాలని, అరైవల్ రిజిష్టర్ లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తేదీల వారీగా రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పిఎసిఎస్, ఐకేపీ, మెప్మ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ధాన్యాన్ని తరలించేందుకు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. నేటికి ఎంత మంది రైతులు దాన్యం తీసుకువచ్చారని కలెక్టర్ వివరాలు అడుగగా, 112 మంది రైతులు ధాన్యాన్ని కేంద్రం కు తీసుకు వచ్చారని, 62మంది రైతుల ధాన్యం కాoట అయిందని,50 మంది రైతుల ధాన్యం తేమ శాతం రాలేదని, ఐదు ట్రాక్టర్లు,7 లారీల ధాన్యం సెంటర్ నుంచి తరలించడం జరిగిందని, 2 ఎలక్ట్రానిక్ కాంటాలు, ప్యాడిక్లీనర్ యంత్రాలు, టార్పాలిన్ లు అందుబాటులో ఉన్నాయని, ఎక్కువగా ఆరున్నర ర్రకం వడ్ల ను రైతులు సెంటర్ కు తేవడం జరుగుతుందని సెంటర్ ఇంచార్జ్, సంబంధిత అధికారులు కలెక్టర్ కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నర్సింగ్ రావు, డి ఎం మహేందర్, డి ఎస్ ఓ డి టి నారాయణ రెడ్డి, ఏవో తిరుపతిరెడ్డి, ఏ ఈ ఓ పూజిత, సీవో ప్రమోద్, సెంటర్ ఇన్చార్జి షఫీ, రైతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post