మిషన్ కాకతీయతో రూపురేఖలు మారి ఖమ్మం నగరానికే మణిహారంగా నిలిచిన లకారం ట్యాంక్ బండ్

ప్రచురణార్ధం    

అక్టోబర్ 26, ఖమ్మం :-                                

మిషన్ కాకతీయతో రూపురేఖలు మారి ఖమ్మం నగరానికే మణిహారంగా నిలిచిన లకారం ట్యాంక్ బండ్

“చెరువుల  పునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా ఖమ్మం నగరం నడిబొడ్డున గల లకారం చెరువు నేడు లకారం ట్యాంక్ గా మారి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందిస్తున్నది.

దాదాపు 162 ఎకరాల విస్తీర్ణం కలిగి 2014 సంవత్సరం కంటే ముందు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న లకారం చెరువును ఖమ్మం శాసనసభ్యులు రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ప్రత్యేక శ్రద్ధతో 2015 సంవత్సరంలో మిషన్ కాకతీయ మొదటి దశ కింద ముఖ్యమంత్రి హామీ నిధులు, నగరపాలక సంస్థ ప్రత్యేక నిధులు సుమారు 24 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దశల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా 65 ఎకరాల విస్తీర్ణాన్ని ట్యాంక్ బండ్ గా, సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో వాటర్ బాడీగా అభివృద్ధి పర్చడం జరిగింది. నగర ప్రజలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు చిన్నారుల ఆహ్లాదం, వినోదానికై 8 లక్షలతో ఓపెన్ జిమ్, పిల్లల ఆటవిడుపు పరికరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరో 8 లక్షలతో స్కై సైకిలింగును అందుబాటులోకి తేవడం జరిగింది. సాయంకాల సమయంలో లకారం ట్యాంక్ బండ్ కు వచ్చే ప్రజలు, చిన్నారులకు కనువిందుగొలిపే విధంగా 2 కోట్ల వ్యయంతో మ్యూజికల్ ఫౌంటేన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు వల్ల లకారం ట్యాంక్ బండ్ రాత్రి వేళల్లో ప్రత్యేక ఆకర్షణీయంగా సంతరించుకుంది. దీనితో పాటు సంక్రాంతి, దసరా, దీపావళీ పండుగల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు స్కేటింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నగర ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాలు పర్యాటకులు లకారం ట్యాంక్ బండ్ ను సందర్శించడం తప్పనిసరిగా మారింది. సుమారు 40 లక్షలతో 25 మంది పరిమితి గల పెద్ద బోటు, 5 గురు పరిమితి గల చిన్న బోటు సౌకర్యాన్ని లకారం ట్యాంక్ బండ్ లో ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు బోటింగ్ సదుపాయం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ట్యాంక్ బండ్ కు వచ్చే సందర్శకులకు రుచికరమైన వివిధ రకాల ఆహార పదార్థాలను, శీతల పానియాలను, చిన్నారులకు ఆట వస్తువులను అందించేందుకు గాను 9 లక్షలతో చూపరులకు కనువిందు చేసే విధంగా ఆకర్షణీయమైన ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది 8 కోట్లతో చేపట్టిన సస్పెన్షన్ బ్రిడ్జి త్వరలోనే నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నది.

లకారం ట్యాంక్ బండ్ ను అనుసంధానం చేస్తూ కేవలం వాకర్స్ కొరకు మినీ లకారం ట్యాంక్ బండ్ వాకర్స్ ప్యారడైజు అమృత్ పథకం కింద 1.50 కోట్లతో ఆధునీకరించనైనది. ఇట్టి వాకర్ ప్యారడైజ్ లో కేవలం వాకర్స్ కొరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయాలు కేటాయించి నెల , త్రైమాసిక, అర్ధ   వార్షిక, వార్షిక చందాదారులుగా చేర్చి నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ సదుపాయాలను కల్పించడం. జరిగింది.

5, ఫిబ్రవరి 1946వ సంవత్సరంలో జాతిపిత మహాత్మాగాంధీ ఖమ్మంలో గడిపిన మధురస్మృతులను నేటి, భావితరాలకు తెలిసే విధంగా లకారం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీజీ ప్రతిమ లకారం.  ట్యాంక్ బండ్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 7 సంవత్సరాల క్రితం అందవిహీనంగా ఉన్న లకారం చెరువు నేడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ప్రత్యేక చొరవ, జిల్లా కలెక్టర్ గారి నిరంతర పర్యవేక్షణ ద్వారా ఖమ్మం నగరానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం లకారం   ట్యాంక్ బండ్ ప్రత్యేకతను సంతరించుకున్నది.

,

Share This Post