పత్రిక ప్రకటన
తేది :21.11.2022
నిర్మల్ జిల్లా సోమవారం
మిషన్ భగీరథ పనితీరు పై
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ , అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎమ్మెల్యే లు విఠల్ రెడ్డి, రేఖా శ్యామ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, సంబంధిత అధికారులతో కలసి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతి ని ఆరా తీస్తు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా ఈ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్చ మైన త్రాగునీరు అందించాలన్నారు. కానీ కొన్ని చోట్ల పనులు నత్త నడకన సాగుతున్నాయని, కొన్ని చోట్ల మురికి కాల్వల నుండి పైప్ లైన్లు వేశారని, అలా వేసిన వాటిని తొలగించి ఇతర మార్గం గుండా వేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుకీ మాట్లాడుతూ పైప్ లైన్ల విషయం లో అధికారులు అలసత్వం ప్రదర్శించ వద్దని, అన్ని శాఖల అధికారులతో సమన్వయం ఏర్పరచుకొని పనులు ముందుకు సాగించాలని అన్నారు. ఈ విషయమై ప్రతి వారం మండల స్థాయి లో సమావేశం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంపిడిఓ లు
ఈ విషయం లో శ్రద్ధ చూపాలన్నారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశం లో సంబంధిత శాఖాధి కారులు, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.