మిషన్ మోడ్ లో ఈ హెల్త్ ప్రొఫైల్: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*మిషన్ మోడ్ లో…ఈ-హెల్త్ ప్రొఫైల్*

– *త్వరితగతిన పూర్తి పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి*

– *రోజూ వారీగా క్షేత్ర ప్రగతిని సమీక్షిస్తున్న కలెక్టర్*

– *సర్వే పూర్తి కి ఈ నెల 20 డెడ్ లైన్*

——————————

భారతదేశములోనే మొట్టమొదటి సారిగా మన రాష్ట్రములోని ప్రజలందరి ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమం ఈ – హెల్త్ ప్రొఫైల్.

రాష్ట్ర ప్రజల ఈ – హెల్త్ ప్రొఫైల్ రూపొందించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ములుగు జిల్లా ను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు .

ఈ కార్యక్రమం ను రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్చి 5న వేములవాడ లో రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి శ్రీ కే తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది.

ఈ కార్యక్రమములో భాగముగా ఆరోగ్యకార్య కర్తలు ప్రతి ఇంటిని సందర్శించి 18 సం.రాలు దాటి, అవసరమైన వ్యక్తులకు సుమారు 30 రకాల ఆరోగ్య పరీక్షలు (బ్లడ్ గ్రూప్, రక్తహీనత, కిడ్నీ సంబందిత, కాలేయ సంబంధిత, మొదలగు పరిక్షలు) మన తెలంగాణా డయాగ్నోస్టిక్ జిల్లా హబ్ నందు నిర్వహించి….. భవిష్యత్తులో వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా చేయబోయే మొదటి అడుగు ఈ బృహత్తర కార్యక్రమం.

ఈ కార్యక్రమం లో భాగముగా మన రాష్ట్రంలోని 18 సం.రాలు పైబడిన వ్యక్తులలో అవసరమైన వారికి (వారు స్త్రీ అయిన పురుషుడు అయిన) ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆయా పరీక్షల వివరాలను “డిజిటల్ హెల్త్ ప్రొఫైల్” రూపములో… కంప్యూటర్ లో భద్రపరచి, పరీక్ష చేయబడిన వ్యక్తులకు అవసరమైన “ఉచిత మందులు” అందజేయడమే కాకుండా….. భవిష్యత్తులో వారికి రావడానికి అవకాశము కల బీమారీలను ముందుగానే శాస్త్రీయముగా అంచనా వేసి…. వారికి ఆయా వ్యాధులు రాకుండా కట్టడి చేయడం ఈ కార్యక్రమము యొక్క ముఖ్యోద్దేశం.

ఈ కార్యక్రములో భాగముగా వ్యక్తులకు చేసిన పరీక్షలను “ఆధార్ కార్డు” ద్వారా అనుసంధానం చేసిన ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు సంఖ్య గల “ఆరోగ్య కార్డు”లో భద్రపరచి ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. దీని వలనఆ వ్యక్తి ఏదైనా అత్యవసర సమయములో అత్యవసర పరిస్థితులలో (ఎమర్జెన్సీ)…. ఆరోగ్య సమస్యను ఎదుర్కొనే సమయములో వారిని పరీక్షించే డాక్టర్ డిజిటల్ ఆరోగ్య కార్డును ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య సమాచారం పూర్తిగా తెలుసుకొని….. ఖచ్చితమైన మందులు ఇచ్చి వైద్యం చేయడమువలన ఆట్టి వ్యక్తి సురక్షితముగా ప్రాణాపాయం నుండి బయటపడతారు..

*మిషన్ మోడ్ లో… ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వే*

ఒకే ఒక్క క్లిక్ తో….. ప్రజల
ఆరోగ్య చరిత్ర తెలుసుకునేలా ఈ – హెల్త్ ప్రొఫైల్ రూపొందించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తలమునకలై ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షించి వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు . నమూనాలను పరీక్షించడంలోనూ జాప్యం జరుగుతుండడంతో దీని నివారణకు రూ .27 కోట్లతో అత్యాధునిక యంత్ర పరికరాలను అమర్చారు . రోజుకు ఆరు నుండి ఏడు వేల నమూనాలను విశ్లేషిస్తూ… సర్వేను మే 20 వ తేదీ లోగా పూర్తి చేసే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి పర్యవేక్షణలో వైద్యఆర్యోశాఖ ముందుకు సాగుతోంది .

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ – హెల్త్ ప్రొఫైల్ సర్వేలో జిల్లాలో 18 సంవత్సరాలు, ఆ పైన వ్యక్తులు 3 లక్షల 60 వేలు ఉండగా ఇప్పటి వరకూ 2 లక్షల 40 వేల మందికి పరీక్షలు చేశారు.
ఇప్పటికీ నిర్దేశిత లక్ష్యం లో 66 శాతం పూర్తయింది .

తొలుత 50 బృందాలతో సర్వేను ప్రారంభించారు
ఈ – హెల్త్ ప్రొఫైల్ పై అవగాహనా రాహిత్యంతో వైద్య బృందాలు గ్రామాలకు వెళ్లినపుడు ప్రజలు కొంత వెనకడుగు వేశారు . వారికి అవగాహన , చైతన్యం కల్పిస్తూ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు .
ఫలితం ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో పరీక్షల లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వేగం పెంచారు.

జిల్లాలోని 13 మండలాల లోని 15 ఆరోగ్య కేంద్రాల పరిధిలో 203 బృందాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరింత వేగం పెంచేందుకు ఫైనల్ సంవత్సరం నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న చదువుతున్న 84 మంది సేవలను ఉపయోగించు కుంటున్నారు. ఫలితంగా సర్వే లో వేగం పెరిగింది. ఇప్పటికీ 1 లక్షా 8 వేల 892 గృహాల్లో సర్వే పూర్తయింది . వీరిలో 2 లక్షల 36 వేల 291 మందికి పరీక్షలు చేయగా 3 లక్షల 43 వేల 534 రక్త నమూనాలు సేకరించారు .

*ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో నమూనాల విశ్లేషణ, ఫలితాల నిక్షిప్తం*

ఫలితాలను ఖచ్చితత్వంతో విశ్లేషించడం , నమోదు చేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానమైనఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే పరికరాలు వాడుతున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో నమూనాల విశ్లేషణ, ఫలితాల నిక్షిప్తం చేస్తున్నారు. ఇందు కోసం రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రత్యేక చొరవ తో రూ.30 కోట్ల విలువైన పరికరాలను ఉపయోగిస్తున్నారు.
మూడు ఇంటిగ్రేటెడ్ అనలైజర్ మిషన్ లు, నాలుగు సీపీబీ అనలైజర్లు , ఆరు రక్తగ్రూపులు , సెంట్రల్ ప్యూజియర్ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సాంకేతిక విభాగం పర్యవేక్షణలో వీటి నిర్వహణ ఉంటుంది . రోజుకు సగటున ఆరు వేల రక్తనమూనాలను పరీక్షించడంతోపాటు వాటి పూర్తి వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తుంది . ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను గోప్యంగా ఉంచడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు .

*పొరుగు జిల్లాల తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలు వినియోగం*
రక్త నమూనాలను వేగంగా విశ్లేషించేందుకు జిల్లా కేంద్రం సిరిసిల్లలోని తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ తో సహా సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్
సేవలను ఉపయోగించుకుంటున్నారు. నమూనాలను వేగంగా తరలించేందుకు మొత్తం 26 ప్రత్యేక వాహనాల ను అద్దె ప్రాతిపదికన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమకూర్చు కున్నారు.

*ఈ – హెల్త్ ప్రొఫైల్ సర్వే వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం*

రాజన్న సిరిసిల్ల జిల్లా లో హెల్త్ ప్రొఫైల్ సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా ఇప్పటికే సర్వే బృందాల సంఖ్యను పెంచాం. ఫలితాలను వేగంగా విశ్లేషించి ఫలితాలను నిక్షిప్తం చేసేందుకు జిల్లా కేంద్రం సిరిసిల్లలోని తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ తో సహా సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ – హెల్త్ ప్రొఫైల్ సర్వే ను పూర్తి చేస్తాం.
– *అనురాగ్ జయంతి,జిల్లా కలెక్టర్*
*రాజన్న సిరిసిల్ల*

—————————-

Share This Post