మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన మీడియా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను పురస్కరించుకొని కలెక్టరేట్లోని క్రీడా ప్రాధికారిక శాఖ కార్యాలయంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మరియు మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం నాడు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రాతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఆయన ఎన్నికల సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీవీ లలో టెలికాస్ట్ అయ్యే రికార్డింగ్ సిస్టంను, వార్తా పత్రికలలో ప్రచురితమయ్యే వార్తలను ఆయన పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన వార్తలను రికార్డ్ చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఎం సి ఎం సి కి డి.సి.ఓ. సింహాచలం, మీడియా కేంద్రానికి మెప్మా పిడి రాములు నోడల్ అధికారులుగా విధులు నిర్వహించనున్నారు. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడానికి ముందస్తుగా ఎం సి ఎం సి ద్వారా అనుమతి పొందాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మెప్మా పిడి రాములు, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, కలెక్టరేట్ ఏవో సుదర్శన్, సమాచార శాఖ అధికారులు రామ్మోహన్ రావు, నర్సింలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post