ప్రచురణార్థం 28-11-2022
మీసేవ సెంటర్లలో సిటిజన్ చార్ట్ తప్పనిసరిగా పెట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మీసేవ సెంటర్ ఆపరేటర్లతో అదనపు కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మీసేవ సెంటర్కు వచ్చు అభ్యర్థుల నుండి ప్రభుత్వం సూచించిన రుసుము కంటే కొన్ని మీసేవ సెంటర్లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్గా తెలిపారు. మీసేవ సెంటర్లన్నీ ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం నడపాలని ఆయన అదనపు కలెక్టర్ ఆదేశించారు. మీసేవ సెంటర్లోని నోటీసు బోర్డులో కంప్లైంట్ నెంబర్ తప్పనిసరిగా పెట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. కొంతమంది మీ సేవ సెంటర్లు సర్వీస్ చార్జీలు, గ్లో సైన్ బోర్డులు పెట్టడం లేదని తప్పకుండా అన్ని మీసేవ సెంటర్ల వారు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఈ డి ఎం గఫార్కు తెలిపారు. భూ సమస్యలపై మీసేవ సెంటర్లకు వస్తున్న రైతులకు ధరణి కొత్త మాడ్యూల్స్ వివరించాలని, మీసేవ వారు ధరణి లో నమోదు వివరాలు తప్పుగా చేస్తున్నారని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మీసేవ సెంటర్లలో సెంటర్ యజమానులు ఉండడం లేదని మీసేవ డిఎం, ఇడిఎంలు మీసేవ సెంటర్లను పరిశీలించి నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వృద్ధాప్య పెన్షన్ కొరకు వయస్సు మార్పులు చేసుకునే వారికి ఎలాంటి ఆధారాలు లేకుండా కొన్ని మీసేవ సెంటర్లలో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని అట్టి మీసేవ సెంటర్ల వివరాలు తమ సిబ్బంది వద్ద ఉన్నాయని వారిపై చర్యలు తీసుకోబోతున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. మీసేవ సెంటర్లకు వచ్చు ప్రజలను రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని క్రమ పద్ధతిలో సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని మీసేవ సెంటర్లను ప్రభుత్వం ఒక ప్రత్యేక నమ్మకంతో ఏర్పాటు చేసిందని వీటిని సద్వినియోగపరుచుకోవాలని మీసేవ సెంటర్ ఆపరేటర్లకు మదనప కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, వెంక రెడ్డి, కిషోర్ కుమార్, డిఎస్పి నాగభూషణం, ఇడిఎం ఎక్ బాల్, సి ఎస్ సి సెంటర్స్ అధికారి శ్రీ చరణ్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
————‐——————————–
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సూర్యపేట వారిచే జారీ చేయనైనది.