మీ సేవలో కోవిడ్ ఎక్స్ గ్రేసీయా సర్వీస్ :::మీసేవ జిల్లా మేనేజర్ గులాం గఫార్ అహ్మద్

మీ సేవలో కోవిడ్ ఎక్స్ గ్రేసీయా సర్వీస్… మీసేవ ఆన్లైన్ సర్వీసుల్లో భాగంగా కోవిడ్ వ్యాధి తో మరణించిన వారికి ప్రభుత్వం నుంచి రూ. 50వేల ఎక్స్ గ్రేసీయా పొందేందుకు ప్రేత్యేక ఆన్లైన్ సర్వీసు (ఓడిసీడీ) ను తెలంగాణ ప్రభుత్వం మీ సేవ కేంద్రాలలో బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మీసేవ జిల్లా మేనేజర్ గులాం గఫార్ అహ్మద్ తెలిపారు. కోవిడ్ సోకి మరణించిన వ్యక్తి వివరాలతో బాధిత కుటుంబీకులు (నామినీ) నేరుగా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రూ. 50 వేల ఎక్స్ గ్రేసీయా పొందేందుకు  పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంచిన ఆన్లైన్ దరఖాస్తుకు  మృతుల ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికెట్, కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్, ఆస్పత్రి రిపోర్ట్ లతో పాటు నామినీ కి సంబంధించిన వేలిముద్రలు, ఆధార్, బ్యాంకు వివరాలను   అనుసంధానం చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కేంద్రాల నిర్వాహకులు ఎలాంటి రుసుము వసూలు చేయరాదని హెచ్చరించారు. టోల్ ఫ్రీ నెం. 1100 కి ఫిర్యాదు చేయాలని కోరారు. ఫోటో రైటప్: గులాం గఫార్ అహ్మద్, మీసేవ జిల్లా మేనేజర్.

Share This Post