మీ సేవ కేంద్రాల్లో అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు : జిల్లా ఈడీఎం గులాం గఫార్ అహ్మద్

మీ సేవ కేంద్రాల్లో అధిక రుసుము వసూలు చేస్తే చర్యలు మీసేవ కేంద్రాల నిర్వాహకులు నిర్దారిత ధరకు మించి అధిక రుసుము వసూలు చేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఈడీఎం గులాం గఫార్ అహ్మద్ హెచ్చరించారు. గురువారం నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లోని మీసేవ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడుతూ ఆసరా పెన్షన్ల దరఖాస్తులను ఉచితంగా నమోదు చేయాలన్నారు. అన్ని మీ సేవా కేంద్రాల్లో సిటిజెన్ చార్ట్ ప్రదర్శించాలన్నారు. ఆధార్ సహా ఇతర సర్వీస్లకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు మాత్రమే తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కేంద్రాలు రద్దు చేస్తామన్నారు. మీ సేవా కేంద్రాల నిర్వహణ తీరుపై జిల్లా వ్యాప్తంగ ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీ ఎం గౌతమ్ ఉన్నారు.

 

Share This Post