మీ-సేవ ద్వారా సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదం – ఈడిఎం మేనేజర్ కవిత

ప్రచురణార్థం

మీ-సేవ ద్వారా సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసాదం – ఈడిఎం మేనేజర్ కవిత

పెద్దపల్లి, ఫిబ్రవరి-14:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసాదంను మీ-సేవ ద్వారా అందించేలా ఏర్పాట్లు చేసిందని ఈ-సేవ జిల్లా మేనేజర్ కవిత తెలిపారు.

ఈడిఎం మేనేజర్ కవిత

భక్త్తులు తమ సమీపంలోని మీ-సేవా కేంద్రంలో 225 రూపాయలు చెల్లిస్తే, కొరియర్ ద్వారా నేరుగా ఇంటికే సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసాదంను పంపించడం జరుగుతుందన్నారు. భక్తులు చెల్లించే 225 రూపాయలలో ప్రసాదం ధర 190 రూపాయలు కాగా, సేవా రుసుము క్రింద 35 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని అన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

—————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారి చేయనైనది.

Share This Post