మీ సేవ వ్యవస్థ ప్రారంభించబడి  పది సంవత్సరాలు అవుతున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ అనుదీప్

మీ సేవ వ్యవస్థ ప్రారంభించబడి   పది సంవత్సరాలు అవుతున్న తరుణంలో  జిల్లా కలెక్టర్ అనుదీప్   మీ సేవా కేంద్రాల వినియోగదారులు, తహసిల్దార్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి శుభాకాంక్షలు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ సేవ అనేది ప్రజల యొక్క అనేక అవసరాల నిమిత్తం వినియోగించుకొని సర్టిఫికెట్ల కొరకు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒక నిర్దిష్ట ప్రదేశం నుంచి అప్లై చేసుకొనే ఆన్లైన్ విధానమని, ఈ విధానం ద్వారా ఎకౌంటుబిలిటి, పారదర్శకత ఉంటుందని చెప్పారు. జిల్లాలో 109 మీ సేవ సెంటర్లు ఉన్నాయని,  ఇట్టి మీసేవ సెంటర్ల ద్వారా ఒక రోజుకి వేల సంఖ్యలో ప్రజా సంబంధిత అవసరాల కోసం    ట్రాన్సాక్షన్ లు జరుగుతున్నాయని తెలిపారు. మీసేవ సెంటర్ల ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు స్వశక్తితో  నిలబడి ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వం సంకల్పం మేరకు పని చేస్తున్నారని కొనియాడారు.  ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన పథకాలైన ధరణి ఆసరా పెన్షన్ పన్నులు వసూలు సర్టిఫికెట్లు వంటి అనేక రకాల సర్వీసులు చేస్తున్నట్లు గా భవిష్యత్తులో రాబోవు సర్వీసులు కూడా అదే రకమైన కృషిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక చక్రవర్తి, ఏఓ గన్య నాయక్ మండల తహసీల్దార్లు, ఈ డి ఎం విజయ సారథి,

డి ఎం శివ కృష్ణ పాల్గొన్నారు..

 

Share This Post