ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం2*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 25: పెండింగ్ లో ఉన్న ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ, ప్రత్యేకాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధ్య మానేరు నిర్వాసితుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు అందించాల్సిన పరిహారం, తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రత్యేకాధికారులు వారికి కేటాయించిన గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, నివేదిక సమర్పించాలన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, ప్రత్యేకాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post