ముఖ్యమంత్రి కీసీఆర్ కృషివల్లే గ్రామాల రూపురేఖలు ఎంతో బాగా మారాయి ఎనిమిదేళ్ళలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పల్లె ప్రగతి తో గ్రామాల రూపురేఖల్లో మార్పు.., రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

పత్రిక ప్రకటన

తేదీ : 06–06–2022

ముఖ్యమంత్రి కీసీఆర్ కృషివల్లే గ్రామాల రూపురేఖలు ఎంతో బాగా మారాయి

ఎనిమిదేళ్ళలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పల్లె ప్రగతి తో గ్రామాల రూపురేఖల్లో మార్పు.., రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

ముఖ్యమంత్రి దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో , కీసరలో పల్లె ప్రగతిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రలు దయాకర్‌రావు, మల్లారెడ్డి. అధికారులు, ప్రజాప్రతినిధులు

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల గ్రామాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయని మంచి సంకల్పంతో గ్రామాలను బాగు చేసి వాటి రూపురేఖలు మార్చారని ఈ విషయంలో ఎనిమిదేళ్ళలో ఎంతో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో రూ.1.30 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడుచింతపల్లి  గ్రామానికి చేరుకోగానే ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్ డి ఎఫ్, నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడే మంత్రులిద్దరూ కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. అలాగే  స్టేడియం,  సి సి రోడ్స్  , షాపింగ్ కాంప్లెక్స్,  డంపింగ్ యార్డు, వైకుంఠధామం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తదితర పనులను జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ శరత్, జిల్లా కలెక్టర్ హరీశ్‌తో కలిసి మంత్రులు దయాకర్‌రావు, మల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ  ఎనిమిదేళ్ళ పాలనలో దేశంలోనే ఎక్కడా లేని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన పరిపాలనలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం సీఎం కేసీఆర్, అభివృద్ధిని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత కరెంట్, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్స్ అందచేస్తూ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. మహిళాభ్యున్నతి లక్ష్యంగా వారికి స్వయంగా సహాయక సంఘాల ద్వారా రుణాలు అందచేయడంతో పాటు రాజకీయాల్లో కూడా సముచిత స్థానం కల్పించిన ఘనత కేవలం తమ ప్రభుత్వ హయంలోనే జరిగిందని మంత్రి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.230  కోట్లు విడుదల చేస్తున్నామని దీనివల్ల గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా రైతుల పక్షపాతి అని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పొలాల వద్ద కరెంట్ మీటర్లు పెడితే తెలంగాణ రాష్ట్రంలో తన ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టేదిలేదని రైతులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఎక్కడ కూడా మీటర్లు పెట్టకుండా ఉచిత కరెంట్ అందచేస్తున్నామని మంత్రి దయాకర్‌రావు వివరించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిని దత్తత తీసుకొని ఎంతో అభివృద్ధిపర్చామని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో డెబ్బై పెండింగ్ పెన్షన్లు ఉండగా మరో 200 పెన్షన్లను మంజూరు చేస్తున్నామని మంత్రి దయాకర్‌రావు సమావేశంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో మహిళల కోసం ప్రత్యేకంగా రూ.5 కోట్లు రుణాలు అందించాలని మంత్రి దయాకర్‌రావు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని దీనిని దృష్టిలో ఉంచుకొని స్వయం సహాయక సంఘాలు పని చేయాలన్నారు. గ్రామంలో డీఆర్డీఏ, దళితబంధు పథకం ఎలా జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం మేడ్చల్‌ను జిల్లా చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని అప్పట్లో రంగారెడ్డి, హైదరాబాద్ కిందకు వచ్చే ఈ ప్రాంతం ప్రస్తుతం ప్రత్యేక జిల్లా కావడంతో అభివృద్ధి ఎంతో వేగంగా జరుగుతోందని మంత్రి అన్నారు. తన నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్తానంలో తనకు నచ్చిన ఇద్దరు నాయకులు ఉంటే అందులో ఒకరు  స్వర్గీయ ఎన్టీరామారావు కాగా మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.  ఈ విషయంలో వీరిద్దరూ ప్రజల కోసం ఎంతగానో కృషి చేసి వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. త్రాగు నీటి కోసం అల్లాడిపోయిన గ్రామాలను చూసినప్పుడల్లా కడుపు తరుక్కు పోయేదని మిషన్ భగీరథ పథకం తో ఇంటింటికీ త్రాగునీరు అందించడం మహిళల కష్టాలు తొలిగాయన్నారు. మంత్రి దయాకర్‌రావు స్పష్టం చేశారు.

అనంతరం రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావత్తు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేవని ఈ విషయంలో రాష్ట్రంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు.  రాష్ట్రంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలను తీర్చడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో రైతులపై ఉన్న అభిమానంతో సీఎం కేసీఆర్ ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత విద్యుత్తునందిస్తూ వారి ఇబ్బందులను తీర్చారని అన్నారు.  రాష్ట్రంలో కరోనా వంటి సమయలో కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా అందరికీ పింఛన్లు అందచేశామని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ వల్ల పేదింటి వారికి ఎంతో ఆసరాగా నిలిచిందని. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలు పెరగడంతో పాటు వారికి రూ.12 వేలు కూడా అందచేస్తున్న ఘనత తమకే దక్కుతుందన్నారు.  తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించడం, గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాలు, దళితబంధు వంటి ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టామని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ మార్గదర్శకంగా నిలిచారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రస్తుతం  గ్రామాలలో  క్రీడా మైదానాలను యువకులు ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే జిల్లాలోని స్వయం సహాయక మహిళలు స్వయం ఉపాధి రంగాలలో ముందడుగు వేయాలని మంత్రి ఆకాంక్షించారు.

పల్లెప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాలలో అభివృద్ధి జరుగుతోంది

కీసరలో పల్లెప్రగతిలో పాల్గొన్న మంత్రులు దయాకర్‌రావు, మల్లారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో ఎన్నో రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని దీనికి నిధులు కూడా సమృద్ధిగా ఉన్నాయని వాటిని సరిగ్గా వినియోగించుకోవాలని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి కీసరలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీసర గ్రామపంచాయతీ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు క్రీడా మైదానంలో ఖోఖో, కబడ్డీ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర పంచాతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మంత్రి మల్లారెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని గ్రామాలు అందమైన నందనవనలుగా మారుతాయని తెలిపారు. త్వరలోనే 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తాము, సొంతంగా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలను పెట్టునే మహిళలకు 3 లక్షల రూపాయలు ఇస్తున్నాం.మీ ఇంటింటికీ నీళ్ళు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు వచ్చాయిఅని తెలిపినారు, కరోనా మహమ్మారి తో ఆర్థిక ప్రగతి కుంటుపడిన పెన్షన్లను ఏ మాత్రం ఆపలేదన్నారు. అర్హులైన వారికి కొత్తవారికి పెన్షన్లను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు

రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే జిల్లాలో అధికార యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని… అందుకే అన్ని రంగాల్లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాను ముందు స్థానంలో నిలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరి సహకారం ఉండటం తనకెంతో ఆనందంగా ఉందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా ఈనెల 18వ తేదీ వరకు మరిన్ని కార్యక్రమాలను నిర్వహించి గ్రామాల రూపురేఖలు మారి అందంగా కనిపించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కిసర మండలంకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంజూరు అయినా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, (43)చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపడంతో పాటు ఈ సారి ఐదు గ్రామపంచాయతీలకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చేలా కృషి చేస్తామని శరత్ చంద్రారెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో అధికారులందరూ ఎంతో ఉత్సాహంతో పల్లె ప్రగతిలో పాల్గొంటున్నారని… ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ శరత్, జిల్లా కలెక్టర్ హరీశ్, జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మాధురి, రవి,  జిల్లా పంచాయతీ అధికారి,స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post