ముఖ్యమంత్రి పర్యటను పటిష్ట ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
0 0 0 0
ఇటీవల కురిసిన వడగండ్ల వాన పంట నష్టాన్ని పరీశీలించడానికి గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా గురువారం నాడు రామడుగు మండలంలో పంటనష్టాన్ని పరిశీలించడానికి రానున్న తరుణంలో పటిష్టమైన ఏర్పాట్లను ముందుస్తుగా చేపట్టాలని, రామడుగు మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా జరిగిన పంటనష్ట నివేదికను సిద్దం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు, జిల్లా గ్రంధాలయం చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జి.వి. శ్యాంప్రసాద్ లాల్, ఆర్డిఓలు ఆనంద్ కుమార్, హరిసింగ్, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.