ముఖ్యమంత్రి పర్యటన పకడ్బంది ఏర్పాట్లు చేయాలి

ముఖ్యమంత్రి పర్యటన పకడ్బంది ఏర్పాట్లు చేయాలి

7న జగిత్యాలకు అదే రోజు సాయంత్రం నుండి మరసటి రోజు కరీంనగర్ లో పలు కార్యక్రమాల్లో పాల్గోంటారు

ముఖ్యమంత్రి చేతుల మీదుగా సర్క్యూట్ రెస్ట్ హౌజ్ ప్రారంబోత్సవం

రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

. 0 0 0 0

కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవమునకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నందున అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

     ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంగళవారం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 7వ తేదిన హెలిక్యాప్టర్ ద్వారా జగిత్యాల జిల్లాకు ముఖ్యమంత్రి రానున్నారని, జగిత్యాల జిల్లాలో సమీకృత అధికారుల భవన సముదాయం( కలెక్టరేట్) తో పాటు మెడికల్ కళాశాల, జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించి అనంతరం బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గోని సాయంత్రం కరీంనగర్ తీగలగుట్టపల్లి లోని నివాసగృహనికి చేరుకుంటారని తెలిపారు. 8వ తేది ఉదయం కరీంనగర్ జిల్లాలో 12 కోట్లతో అధునాతన వసతులతో నిర్మించిన ఆర్ ఆండ్ బి అతిథి (“కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌజ్” ) గృహానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రివర్యులు పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం జిల్లా కేంద్రంలోని
వి-కన్వేన్షన్ లో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూతూరి వివాహ వేడుకకు హాజరు కానున్నారని తెలిపారు. రోడ్డు మార్గంద్వారా జిల్లాలో తిరగనున్న సందర్బంగా ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని అవసరం ఉన్నచోట రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. స్పోర్ట్స్ కళాశాలలో హెలిప్యాడ్ ను సిద్దం చేయాలని సూచించారు. ఎక్కడకూడా అవసరం ఉన్న చోట రోడ్డు మరమత్తు పనులను చేపట్టాలని, తీగల గుట్టపల్లి లో నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండాలని,విద్యూత్, సానిటేషన్ సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. మొక్కలతో పచ్చగా కళకలలాడేలా చూడాలని తెలిపారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, సిపి వి.సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జి.వి. శ్యాంప్రసాద్ లాల్, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణా రావు, ఆర్ అండ్ బి ఈఈ సాంబశివరావు, ఏఈ లు లక్ష్మణ్ రావు, రాజ శేఖర్, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్ తదితరులు పాల్గోన్నారు.

Share This Post