ముఖ్యమంత్రి విజన్ తో ప్రారంభించిన ధరణి కార్యక్రమం విజయవంతమై భూసమస్యల పరిష్కారానికి దేశంలోనే ఒక మోడల్ పథకంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 29 (శుక్రవారం). ముఖ్యమంత్రి విజన్ తో ప్రారంభించిన ధరణి కార్యక్రమం విజయవంతమై భూసమస్యల పరిష్కారానికి దేశంలోనే ఒక మోడల్ పథకంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ధరణి పోర్టల్ అనేది సిటిజన్ ఫ్రెండ్లీ అప్లికేషన్ అని, భూసంబంధ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపే వన్ స్టాప్ సెంటర్ అని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజన్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారుల కష్టం ఫలితంగా రూపుదిద్దుకున్న ధరణి పోర్టల్ రాష్ట్రంలో విజయవంతమై భూ సమస్యల పరిష్కారానికి, పారదర్శకతకు, తక్షణ రిజిస్ట్రేషన్ కి మారుపేరుగా దేశ స్థాయిలో ఇతర రాష్ట్రాలు అమలు చేయడానికి ఒక మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. జిల్లా స్థాయిలో పూర్తయిన లావాదేవీలు అమ్మకం 4656, బహుమతి 2138, వారసత్వం 600, తనఖా 1070 మరియు జిల్లాలో పరిష్కరించబడింది ఫిర్యాదులు పెండింగ్ మ్యుటేషన్ 1937, భూమి విషయాలపై ఫిర్యాదులు 4362, నిషేధించబడిన జాబితా 804, కోర్టు కేసు మరియు సమాచారం 130. జిల్లాలో ధరణి కార్యక్రమం విజయవంతానికి జిల్లా సంయుక్త కలెక్టర్, ఆర్డీవో, తహసిల్దార్లు, తాసిల్దార్ కార్యాలయం ఆపరేటర్లు అందరి కృషి చాలా ఉందని వారందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత మాట్లాడుతూ ధరణి కార్యక్రమం ప్రారంభానికి ముందు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అనేక భూ సంబంధ దరఖాస్తులు వచ్చేవని కానీ ధరణి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందున ప్రస్తుతం భూ సంబంధ సమస్యలు ప్రజావాణి కార్యక్రమానికి తక్కువ స్థాయిలో వస్తున్నాయని తెలిపారు. ఆర్డీవో శ్రీనివాస్, తాసిల్దార్ ఇక్బాల్ మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారానికి గతంలో ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది కానీ ప్రస్తుతం ధరణి కార్యక్రమం ద్వారా ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైతుల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సాఫీగా వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. ధరణి పోర్టల్ వన్ ఇయర్ సక్సెస్ పోస్టర్ ను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ ప్రెస్ మీట్ లో ఇ-డిస్టిక్ మేనేజర్ శ్రీకాంత్, ధరణి డిస్టిక్ కోఆర్డినేటర్ భవాని, ధరణి ఆపరేటర్ సాగర్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post