ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేద కుటుంబలాకు. అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

బుధవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరంగల్ పశ్చిమ నియెజకవర్గనికి చెందిన 54 మందికి ఆనారోగ్యంతో బాధపడుతూ ప్రయివేటు హాస్పిటల్ లో చికిత్స పొందిన వారికి సియం సహాయ నిధి నుండి 31 లక్షల 71 వేల 500 రూపాయల విలువ గల చెక్కులను లబ్దిదారులకు అందచేశారు. చెక్కుతో పాటు ఒక మొక్క ను లబ్దిదారులకు అందచేశారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్షలాది రూపాయలు మంజూరు చేసి నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలుస్తుందన్నారు. వినాయక చవితి పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పూజించాలని ఆయన కోరారు.రసాయనల ద్వారా తయారు చేసిన విగ్రహాల వలన త్రాగునీరు కలుషితమవుతదని, అనారోగ్యం సమస్యలు ఎదురవుతాయని, కలుషిత నీరు త్రాగడం వలన మూగ జీవులు మరణిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ వాసుచంద్ర, సంబంధిత కార్పెరేటర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Share This Post