ముఖ్యమత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లను పర్యవేక్షించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం-1
జనగామ, డిశంబర్ 17: ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంలో భాగంగా జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయాన్ని , ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపిలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, జిల్లా కలెక్టర్ శివలింగయ్యలతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాకు రానున్న సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల తరపున మంత్రి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు జనగామ అంటే ఎడారి ప్రాంతమని, కనీసం త్రాగడానికి నీళ్ళు దొరికేవి కాదని, కానీ సీఎం కేసిఆర్ నాయకత్వంలో ఈరోజు రెండు పంటలకు సమృద్దిగా నీరు లభిస్తుందని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వల్ల అధికారులు అంతా ఒకేచోట ఉండి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం సులువు అవుతుందన్నారు. మొక్కలకు ఎండిన కొమ్మలు కత్తిరించాలని, ప్రాంగణం సుందరంగా అలంకరించాలని అన్నారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చేపట్టాలని, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కలెక్టర్ కార్యాలయ ప్రారంభం తరవాత టి.ఆర్.ఎస్. పార్టీ కార్యాలయం ప్రారంభం చేస్తారని, అనంతరం బహిరంగ సభ ఉంటుందని అన్నారు. సభను విజయవంతం చేయడానికి మంత్రులం, స్థానిక నాయకత్వము అంతా కలిసి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, ఆర్డీవోలు మధు మోహన్, కృష్ణవేణి, అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post