*ముఖ్యమత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు:: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

*ముఖ్యమత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు:: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

*ప్రచురణార్థం-1*
జనగామ, డిసెంబర్ 16: ఈ నెల 20న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మంత్రి, జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, జనగామ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్యలతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులకు అప్పగించిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తించి విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభోత్సవం చేసి, సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమవుతారని , అటు పిమ్మట తెలంగాణా రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయం ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్యాలయం లోపల, పరిసరాలు అంతా శుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు. పూలతో అలంకరణలు, లైటింగ్, దూరశ్రవణ యంత్రాల ఏర్పాటు, భోజన ఏర్పాట్లు ఎక్కడా ఏ చిన్న సమస్య రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాధ్యతలు కేటాయించిన అధికారులు ముందస్తుగా సంబంధిత వారితో సమన్వయం చేసుకొని, ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. అంతరాయం లేని, నిరంతర విద్యుత్తు సరఫరా ఉండాలన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని, వాహనాల పార్కింగ్ కు సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. అంతకుముందు మంత్రి, జిల్లా కలెక్టర్, జనగామ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశ మందిరం, కలెక్టర్ చాంబర్, స్టేట్ హాల్, మంత్రి చాంబర్, భవన సముదాయం అంతా కలియతిరిగి అధికారులకు ఏర్పాట్లపై సూచనలు చేశారు. వివిఐపి, అధికారులు, పాత్రికేయుల ప్రవేశం, నిష్క్రమణ, వివిఐపి, అధికారుల వాహనాల పార్కింగ్ లపై చర్చించారు. హెలీప్యాడ్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఆర్ అండ్ బి ఇఎన్సి గణపతి రెడ్డి, డిసిపి బి. శ్రీనివాస రెడ్డి, ఆదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post